హీరోగా ఎదుగుతోన్న దశలోనే 'బాహుబలి'లో విలన్ పాత్ర చేయడానికి రానా దగ్గుబాటి సిద్ధపడ్డాడంటే, తన స్టార్ మారిపోతుందనే. రాజమౌళి చిత్రంలో విలన్‌గా నటిస్తే ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేస్తుంది. ఇక దానిని వాడుకుని తగిన కమర్షియల్ చిత్రాలతో హీరోగా రేంజ్ పెంచుకునే అవకాశముంటుంది. కానీ 'బాహుబలి'తో రానా ఆశించిన మ్యాజిక్ జరిగిందా?
తనకిచ్చిన బాధ్యతని రానా చాలా బాగా నిర్వర్తించిన మాట నిజమే కానీ బాహుబలి అనగానే రాజమౌళి, తర్వాత ప్రభాస్ అన్నట్టుంది. రానాకి ప్రత్యేకమైన క్రెడిట్ ఏమీ వస్తోన్న దాఖలాలు లేవు. ఇకపై ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడనే దానిపై రానా కెరీర్ డిపెండ్ అవుతుంది. అయితే కథల ఎంపిక పరంగా రానా ఇంకా కమర్షియల్ సైడ్ వెళుతున్నట్టు లేడు.
ఘాజీ చిత్రం తర్వాత తేజ డైరెక్షన్‌లో చేస్తోన్న 'నేనే రాజు నేనే మంత్రి' ఓ పొలిటికల్ డ్రామా. భళ్లాలదేవుడి ఇమేజ్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసే మాస్ కథాంశాలని రానా ఎంచుకోవడం లేదు. జయం, వర్షం, నిజంలో విలన్ పాత్రలు చేసిన గోపిచంద్ ఆ తర్వాత ఎంచుకున్న రూట్‌ని ఫాలో అయితే రానాకి మాస్ ఫాలోయింగ్ పెరిగే అవకాశాలున్నాయనేది విశ్లేషకుల మాట.