అల్లుడి దర్శకత్వంలో రజనీకాంత్

రజనీకాంత్ అల్లుడు ధనుష్ దర్శకుడిగా కూడా మారాడు. తొలి ప్రయత్నంగా పా పాండీ (పవర్ పాండీకి పేరు మార్చారు) సినిమా తెరకెక్కించాడు. రాజ్ కిరణ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా తమిళనాట…

రజనీకాంత్ అల్లుడు ధనుష్ దర్శకుడిగా కూడా మారాడు. తొలి ప్రయత్నంగా పా పాండీ (పవర్ పాండీకి పేరు మార్చారు) సినిమా తెరకెక్కించాడు. రాజ్ కిరణ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతో ఇప్పుడీ హీరో పా పాండీకి సీక్వెల్ తీస్తానంటున్నాడు. కుదిరితే తన మామనే సీక్వెల్ లో హీరోను చేస్తానంటున్నాడు.

పా పాండీ సినిమాలో వయసు మీదపడిన ఫైట్ మాస్టర్ గా రాజ్ కిరణ్ అద్భుతంగా నటించారు. అటు ధనుష్ దర్శకత్వ ప్రతిభకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో రైటర్ గా కూడా తన టాలెంట్ చూపించాడు ధనుష్. ఇప్పుడు అదే ఉత్సాహంతో పా పాండీ-2 తీస్తానంటున్నాడు. రజనీకాంత్ ఒప్పుకుంటే సీక్వెల్ లో అతడ్ని డైరక్ట్ చేస్తానంటున్నాడు.

ధనుష్ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోంది కానీ, సీక్వెల్ లో హీరోను మార్చేస్తే ఎలా. పా పాండీలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల్ని సైతం మెప్పించాడు రాజ్ కిరణ్. అలాంటి నటుడ్ని తప్పించి, సీక్వెల్ లో రజనీకాంత్ ను హీరోను చేస్తే బాగుంటుందా..? రజనీకాంత్ అడుగుపెడితే సినిమా మార్కెట్, రీచ్ రెండూ పెరుగుతాయి. అలా అని చెప్పి క్రిటిక్స్ మెప్పుపొందిన రాజ్ కిరణ్ ను పక్కనపెడతానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్.

త్వరలోనే రజనీకాంత్ తో ఓ సినిమా నిర్మించబోతున్నాడు ధనుష్. కావాలంటే తన దర్శకత్వంలో మామగారితో మరో సినిమా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ పా పాండీ సీక్వెల్ లో రజనీకాంత్ ను హీరోగా చేస్తాననడం మాత్రం కరెక్ట్ కాదు. అన్నట్టు ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను మోహన్ బాబు దక్కించుకున్నారట.