విడుదల కాకుండానే బాహుబలి లీక్

టెక్నాలజీ పెరిగిపోయింది. పైగా పల్లెల నుంచి పట్టణాల వరకు చేరిపోయింది. ఇది సినిమాలకు వరంగానూ శాపంగానూ కూడా మారిపోయింది. నెట్ లో ప్రచారానికి ఈ టెక్నాలజీ ఊతం ఇచ్చింది. అదే సమయంలో సినిమా టాక్…

టెక్నాలజీ పెరిగిపోయింది. పైగా పల్లెల నుంచి పట్టణాల వరకు చేరిపోయింది. ఇది సినిమాలకు వరంగానూ శాపంగానూ కూడా మారిపోయింది. నెట్ లో ప్రచారానికి ఈ టెక్నాలజీ ఊతం ఇచ్చింది. అదే సమయంలో సినిమా టాక్ క్షణాల్లో కాశ్మీర్ నుంచి కాకినాడ వరకు చేరిపోతోంది. ఇదిలా వుంటే స్మార్ట్ ఫోన్ ల పుణ్యమా అని సినిమా వాట్సప్ లో ప్రత్యక్షం అయిపోతోంది. ఎన్ని థియేటర్లని కట్టడి చేస్తారు. ఎన్ని ఊళ్లలో కట్టడి చేస్తారు.

నిన్నటికి నిన్న బాహుబలి క్లిప్ వాట్స్ ప్ లో తెగ తిరిగేసింది. తెలుగు భాష కాకపోయినా, సబ్ టైటిల్స్ తో సహా క్లారిటీ క్లిప్ అయింది. సినిమా ఎక్కడా ప్రదర్శించలేదని నిర్మాతలు అంటున్నారు. కానీ క్లిప్ చూస్తే థియేటర్ లో తీసినట్లే వుంది. ఈ క్లిప్ లో రానా (భల్లాల దేవ) రాజుగా, ప్రభాస్ (బాహుబలి) సేనాధిపతిగా కనిపించారు ఈ క్లిప్ లో. అలాగే అనుష్క ఓ సీన్ లో రానా  వంక చిరాగ్గా చూడడం కనిపించింది. అలాగే అనుష్క ఇప్పటి వరకు వచ్చిన స్టిల్స్ లో మాదిరిగా కాకుండా కాస్త లావుగా, బొద్దుగానే కనిపించడం విశేషం. ఆ చికాగ్గా పెట్టిన ఫేస్ మరింత చికాగ్గా వుంది కూడా. 

ఈ సంగతి అలా వుంచితే, సినిమా విడుదల కాకుండానే క్లిప్ వాట్స్ ప్ లోకి వస్తే,ఇక 1500 థియేటర్లలో విడుదలవుతోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్ లే. మరి ఇక ఈ రాత్రి నుంచి ఎన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో, వాట్స్ ప్ లో చలామణీ అవుతాయో చూడాలి. చిన్న చిన్న క్లిప్స్ తో సమస్య లేదు. పైగా అవి సినిమా ప్రచారానికి మరింత పనికి వస్తాయి. కానీ సినిమానే సర్క్యులేట్ అయిపోతేనే సమస్య. 

ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని చంపిన సీన్ కనుక వచ్చేస్తే జనాలకు ఆసక్తి పోతుంది. ఇవన్నీ బాహుబలి 2 కి సమస్యలే.