ఒక రోజు ముందుగానే బాహుబలి

బాహుబలి మేనియా మిన్నంటింది. 28 శుక్రవారం కోసం సినిమా జనాలు ఎదురు చూస్తున్నారు. అయితే గురువారం రాత్రి స్పెషల్ షోలు పడతాయని, వేలు, వందలు పెట్టయినా టికెట్ కొని చూడాలని ప్రభాస్ అభిమానులు రెడీ…

బాహుబలి మేనియా మిన్నంటింది. 28 శుక్రవారం కోసం సినిమా జనాలు ఎదురు చూస్తున్నారు. అయితే గురువారం రాత్రి స్పెషల్ షోలు పడతాయని, వేలు, వందలు పెట్టయినా టికెట్ కొని చూడాలని ప్రభాస్ అభిమానులు రెడీ అయిపోయారు. మరోపక్క ముంబాయిలో 27 రాత్రే ప్రివ్యూలు వేస్తున్నారు. తమిళనాడులో కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు.
ఇదిలా వుంటే స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ మంత్రి తలసాని తెగేసి చెప్పారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది లీక్ అయిపోయినా, సినిమా టాక్ వచ్చేసినా, ఇక్కడ జనాలకు కాస్త నీరసం వస్తుందేమో అన్న అనుమానం మరోపక్క వుండనే వుంది. 

అందుకే మధ్య మార్గంగా గురువారం రాత్రి 9 గంటల ఆటల నుంచే బాహుబలిని విడుదల చేస్తే ఎలా వుంటుంది అని నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. అంటే స్పెషల్ షోల పేరిట కాకుండా మామూలుగానే గురువారం రాత్రి 9 గంటల ఆటతో బాహుబలి విడుదల అవుతుందన్న మాట. అప్పుుడు మరే సమస్య వుండదు.

దీనిపై మరి కాస్త క్లారిటీ అఫీషియల్ డిసిషన్ రావాల్సివుంది. మూడు వంతులు ఇదే కన్ ఫర్మ్ అవుతుందని బోగట్టా.