గురువారం రాత్రి బిగ్‌బాస్ షోలో తనని చంపేయమని దేవున్ని నటరాజ్ మాస్టర్ వేడుకున్నారు. పాత హిందీ సినిమాల్లో అమితాబ్‌కి కోపం వస్తే ఇలాగే దేవునితో మాట్లాడేవాడు. అదే స్టైల్‌లో “నేను ఆడి ఆడి అలసిపోయాను. ఈ హౌస్‌లో నాకు ఎవరూ హెల్ప్ చేయరు. నా పాప కోసం ఆడడానికి వచ్చా. నన్ను చంపేయ్” అంటూ ఆకాశం వైపు చూస్తూ దేవునితో మాట్లాడాడు.
దాంతో మిగతా సభ్యులు షాక్ అయ్యారు. బాబా బాస్కర్ వచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తే మాస్టర్ “ఎవరూ నాకు అవసరం లేదు” అంటూ దేవుడితో సంభాషణ కొనసాగించాడు. మిత్ర ప్రయత్నించినా ఆగలేదు.
అఖిల్ సాయం చేయనందున నటరాజ్ టాస్క్‌లో ఓడిపోయాడు. ఆ ఫస్ట్రేషన్ ఇది. అఖిల్ వచ్చి “దేవున్ని అడుక్కుంటే సక్సెస్ రాదు మాస్టర్” అని చెప్పడానికి Try చేస్తే, “నీ సంగతి నాకు తెలుసు” అని ఈసడించాడు.
ఏడుస్తూ దేవునితో మాట్లాడుతున్న నటరాజ్‌ని చూసి అతనికి ఏదో అయ్యిందన్న Expression అందరిలో కనిపించింది. లాస్ట్ సీజన్‌లో కూడా నామినేషన్ సందర్భాల్లో నటరాజ్ Over react అయ్యేవాడు.
సోమవారం కూడా బిందుతో గొడవ పడ్డాడు. “అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎమోషన్స్ వున్నాయి. పదేపదే మీరు పాప ఎమోషన్స్ ప్రస్తావించడం కరెక్ట్ కాదు” అని బిందు అంటే నటరాజ్ ఉగ్ర రూపం చూపించాడు.
“బిందుకి పిచ్చి అని, ఆస్పత్రిలో చేర్పించాలని, ఆమె తండ్రి సరిగా పెంచలేదని, సినిమాల్లో పైకి రాకపోవడానికి ఇదే కారణమని, షో అయిపోతే చెన్నై వెళ్లిపోతుందని, తాను ఇక్కడే ఉండి తెలుగు వాళ్లకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానని” ఇలా చాలా రకాలుగా నిందించాడు.
గేమ్‌లో ఒక్కోసారి అనుకూలంగానూ, ప్రతికూలంగానూ వ్యవహరిస్తుంటారు. కానీ నటరాజ్‌కి వ్యతిరేకంగా ఆడాలంటేనే భయపడే స్థితి కల్పించాడు.
జీఆర్ మహర్షి