నానికి నిజంగా అంత సీనుందా..!

వరుసగా ప్రతి సినిమాతో హిట్ కొడుతున్నాడు నిజమే. చేసే ప్రతి సినిమాతో తన మార్కెట్ వాల్యూ పెంచుకుంటున్నాడు నిజమే. కానీ ఒకేసారి 20 కోట్ల రేంజ్ కు నాని ఎదిగాడా…? ఇప్పుడీ హీరో నిరూపించుకోవాల్సింది…

వరుసగా ప్రతి సినిమాతో హిట్ కొడుతున్నాడు నిజమే. చేసే ప్రతి సినిమాతో తన మార్కెట్ వాల్యూ పెంచుకుంటున్నాడు నిజమే. కానీ ఒకేసారి 20 కోట్ల రేంజ్ కు నాని ఎదిగాడా…? ఇప్పుడీ హీరో నిరూపించుకోవాల్సింది ఇదే. ప్రస్తుతం నేచురల్ స్టార్ టార్గెట్ కూడా ఇదే. 

శివ నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా నిన్నుకోరి అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా 14కోట్ల రూపాయలకు అమ్మేశారని టాక్. ఇక ఓవర్సీస్ రైట్స్ ను మరో మూడు కోట్ల రూపాయలకు అమ్మేశారట. మొత్తంగా చూసుకుంటే నాని కొత్త సినిమా ఖరీదు అటుఇటుగా 17 కోట్ల రూపాయలు. సో.. డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే, ఖర్చులన్నీ పోనూ సినిమాకు కనీసం 20 కోట్ల రూపాయలు రావాలి. 

నాని సినిమాలు ఏవీ ఇప్పటివరకు ప్రీ రిలీజ్ లో 12 కోట్ల రూపాయలు దాటి బిజినెస్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను కోరి సినిమా 14 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేసింది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగు రాష్ట్ర్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకుంది. హీరోగా నాని ఇప్పటికే ఓ పొజిషన్ కు చేరుకున్నారు. అతడి మార్కెట్ వాల్యూ ఎంతనేది మాత్రం “నిన్ను కోరి” సినిమాతో డిసైడ్ అవుతుందన్నమాట.