హిట్ కోసం స్కై డైవింగ్

గోపీచంద్ స్కై డైవింగ్ చేశాడు. ఆకాశం నుంచి అమాంతం దూకేశాడు. గౌతమ్ నంద సినిమా షూటింగ్ లో భాగంగా ఈ రియల్ స్టంట్ ను ఎలాంటి డూప్ లేకుండా చేశాడు గోపీచంద్. సంపత్ నంది…

గోపీచంద్ స్కై డైవింగ్ చేశాడు. ఆకాశం నుంచి అమాంతం దూకేశాడు. గౌతమ్ నంద సినిమా షూటింగ్ లో భాగంగా ఈ రియల్ స్టంట్ ను ఎలాంటి డూప్ లేకుండా చేశాడు గోపీచంద్. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం గోపీచంద్ ఇంత రిస్క్ చేశాడు. ఇప్పుడిదే అంశాన్ని మేకర్స్ ఘనంగా చెప్పుకుంటున్నారు. సౌత్ సినిమాలోనే ఫస్ట్ టైం స్కై డైవింగ్ చేసిన హీరోగా గోపీచంద్ రికార్డు సృష్టించాడట. 

రెండేళ్ల నుంచి గట్టి హిట్ కోసం ట్రై చేస్తున్నాడు గోపీచంద్. లాస్ట్ ఇయర్ అయితే ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయాడు. అందుకే ఇప్పుడు ఆశలన్నీ గౌతమ్ నందపైనే పెట్టుకున్నాడు. అందుకే ఇంత రిస్క్ చేశాడు. ఈ  సినిమాలో గోపీచంద్ ను మోస్ట్ స్టయిలిష్ గా చూపిస్తున్నాడు దర్శకుడు సంపత్ నంది. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తోంది గౌతమ్ నంద సినిమా.

కెరీర్ లోనే ఫస్ట్ టైం గోపీచంద్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు ఈ సినిమాలో. టైటిల్ లోనే చెప్పినట్టు గౌతమ్, నంద అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు. హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.