సరైనోడు స్థానంలో “మిస్టర్” రావాల్సిందట!

బన్నీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ సరైనోడు. బోయపాటి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బన్నీలోని మాస్ యాంగిల్ ను ఫుల్ లెంగ్త్ లో ఎలివేట్ చేసింది. అయితే…

బన్నీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ సరైనోడు. బోయపాటి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బన్నీలోని మాస్ యాంగిల్ ను ఫుల్ లెంగ్త్ లో ఎలివేట్ చేసింది. అయితే ఇంత పెద్ద మాస్ సినిమా స్థానంలో ఓ పక్కా క్లాస్ సినిమా చేయాలనుకున్నాడట ఈ అల్లువారబ్బాయ్. అది కూడా మిస్టర్ మూవీ చేద్దామని అనుకున్నాడట. స్వయంగా శ్రీనువైట్ల ఈ విషయాన్ని వెల్లడించాడు.

అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకొని మిస్టర్ మూవీ కథ రాసుకున్నాడట వైట్ల. అయితే “కొన్ని” కారణాల వల్ల బన్నీ ఆ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యాడట. అదే సమయంలో ఆ కథలో నటించేందుకు వరుణ్ తేజ ముందుకురావడంతో.. కమర్షియల్ గా కథకు మరిన్ని హంగులద్ది మరీ “మిస్టర్” ను తెరకెక్కించాడట శ్రీనువైట్ల.

అయితే  ఆ “కొన్ని” కారణాలేంటనే విషయాన్ని శ్రీనువైట్లను “ఆఫ్ ది రికార్డు” అడిగే ప్రయత్నం చేశారు కొంతమంది. ఆగడు, బ్రూస్ లీ లాంటి అట్టర్ ఫ్లాపులతో ఉన్న వైట్లకు బన్నీ అవకాశం ఇవ్వలేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వైట్ల చెప్పిన లాజిక్ మాత్రం మరోలా ఉంది. సన్నాఫ్ సత్యమూర్తి లాంటి క్లాస్ మూవీ తర్వాత సరైనోడు లాంటి మాస్ మూవీ అయితేనే కరెక్ట్ అని బన్నీ భావించాడట. అందుకే మిస్టర్ లాంటి క్లీన్ మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదట. లాజిక్ అదిరిపోయింది కదా…!