కొత్త వారిని, అందునా సౌండ్ పార్టీలు తమ వారసులను హీరోలు చేయాలనుకున్నపుడు పెద్ద డైరక్టర్ లను పట్టుకోవడం ఆనవాయతీగా మారుతోంది. బెల్లంకొండ సురేష్ భారీగా రెమ్యూనిరేషన్ లు ఇచ్చి వివి వినాయక్ ను, బోయపాటి శ్రీనివాస్‌ను పట్టారు. నిఖిల్ గౌడ కోసం సురేందర్ రెడ్డికి భారీగా అడ్వాన్స్ ఇచ్చారు. ఇషాన్ కోసం పూరి జగన్నాధ్ ను తీసుకున్నారు. అఖిల్ కోసం వివి వినాయక్ కు భారీగా రెమ్యూనిరేషన్ ఇచ్చారు.
ఇదే ఇషాన్ కోసం అగ్ర దర్శకుడు వివి వినాయక్ ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఏకంగా 15 కోట్ల రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసారట. కానీ వినాయక్ టెంప్ట్ అయినట్లే అయి వెనక్కు వెళ్లిపోయాక, పూరిజగన్నాధ్ తో రోగ్ సినిమా తీసారు. నిజానికి రోగ్ సినిమా సంగతి పక్కన పెడితే హీరో ఇషాన్ ఓకెనే. వినాయక్ లాంటి మంచి దర్శకుడు, మంచి సబ్జెక్ట్ తీసుకుంటే కచ్చితంగా హీరో మెటీరియల్ వున్నవాడే. మరి ఎందుకు వినాయక్ జంకినట్లో?