బాహుబలి పార్ట్ వన్ ఓ సంచలనం. మళ్లీ అలాంటి సంచలనానికి తెరలేపుతోంది పార్ట్ 2. అయితే ఫార్ట్ 2 విడుదలకు మూడు వారాలు ముందుగా పార్ట్ వన్ ను విడుదల చేసి, జనాలకు మరోసారి గుర్తు చేయాలన్న స్ట్రాటజీని బాలీవుడ్ లో అమలు చేసే ఆలోచనలో వున్నారు. ఈ మేరకు 7న విడుదల చేస్తారని వార్తలు వెలువడ్డాయి.
అయితే ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తెలుగునాట కూడా అమలు చేసే ఆలోచనలో వున్నారు బాహుబలి నిర్మాతలు అని తెలుస్తోంది. ఏ నిర్ణయం ఇంకా పైకి ప్రకటించకున్నా, 7న బాహుబలి పార్ట్ వన్ ను విడుదల చేస్తే ఎలా వుంటుందీ అని ఆలోచిస్తున్నారట. దీనిప, పాజిటివ్ నిర్ణయమే వెలువడే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో కాటమరాయుడు ఒక్కటే కమర్షియల్ పెద్ద సినిమా. 7న మరీ పెద్ద సినిమాలేం లేవు. 13న మెగా హీరో వరుణ్ తేజ మిస్టర్ వస్తోంది.
అందువల్ల 7న బాహుబలి విడుదల చేస్తే, సమ్మర్ హాలీడేస్ లో బాగుంటుందేమో అన్న ఆలోచన, ఇప్పటికే టీవీల్లో చాలా సార్లు చూసేసారు కనుక మళ్లీ చూస్తారా? అన్న అనుమానం మరోపక్క వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిస్కషన్లు నడుస్తున్నాయి. రేపు లేదా ఎల్లుండి ఏ నిర్ణయమూ వెలువడే అవకాశం వుంది.