టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ రెమ్యూనిరేషన్ అందుకుంటున్న హీరో ఎవరు? నిన్నటి దాకా సూపర్ స్టార్ మహేష్ బాబునే. ఎందుకంటే మురుగదాస్ తో చేస్తున్న సినిమాకు ఆయన తీసుకున్నది ఇరవై కోట్లు అని అనధికార వర్గాల బోగట్టా. పవన్ గత రెండు సినిమాలు దాదాపు స్వంత బ్యానర్ లాంటి శరత్ మరార్ తో చేసారు కాబట్టి, దాని వైనాలు తెలియవు.
ఇక ఎన్టీఆర్, బన్నీ, చరణ్ అంతా 15 కోట్ల రేంజ్ లో వున్నారు. సో, టాప్ రెమ్యూనిరేషన్ రికార్డు మహేష్ దగ్గరే వుంది. చిరంజీవి రీ ఎంట్రీ కూడా స్వంత బ్యానర్ కాబట్టి రెమ్యూనిరేషన్ ఎంత అన్నది లెక్కకు రాదు. ఖర్చు, లాభాలు వాళ్లవే కాబట్టి.
అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాన్ని బ్రేక్ చేసేసినట్లే. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే హారిక హాసిని సినిమాకు పవన్ రెమ్యూనిరేషన్ ముఫై కోట్లంట. ఇది నిజంగా షాకింగ్ నే. తెలుగు హీరోల రెమ్యూనిరేషన్ ఈ రేంజ్ కు చేరడం. దీని తరువాత మైత్రీ మూవీస్ సినిమాకు పవన్ ఇంకా ఎక్కువే డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. నలభై రోజుల కాల్ షీట్లకు నలభై కోట్లు అని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే హారిక హాసిని సినిమాతో డైరక్టర్ త్రివిక్రమ్ కూడా కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. ఆయన పారితోషికం 20 కోట్లు అని తెలుస్తోంది. తెలుగులో ఇంత వరకు ఏ డైరక్టర్ కూడా ఇంత రెమ్యూనిరేషన్ తీసుకోలేదు. మాగ్జిమమ్ 12 కోట్ల వరకే వుంది. ఇంతకు ముందు సినిమాకు త్రివిక్రమ్ 10 కోట్ల వరకు తీసుకున్నారు. దీంతో ఆయన రెమ్యూనిరేషన్ డబుల్ అయినట్లే.