పవన్ తో అంత వీజీ కాదు?

ఆలోచన వేరు, ఆచరణ వేరు. సినిమా ల వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా అనుకుంటారు. చకచకా సినిమాలు చేసేయాలనుకుంటారు. కానీ అలా చేయడం మాత్రం కనిపించడం లేదు. ముగ్గురు నలుగురి అడ్వాన్స్…

ఆలోచన వేరు, ఆచరణ వేరు. సినిమా ల వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా అనుకుంటారు. చకచకా సినిమాలు చేసేయాలనుకుంటారు. కానీ అలా చేయడం మాత్రం కనిపించడం లేదు. ముగ్గురు నలుగురి అడ్వాన్స్ లు దగ్గర వున్నాయి. ఎప్పుడు సెట్ మీదకు వెళ్తాయో తెలియదు.

లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, మైత్రీ మూవీస్ కు సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేయడానికి డేట్లు ఇచ్చేసారని. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తరువాత చేయాల్సింది ఎఎమ్ రత్నం నిర్మాతగా ఓ సినిమా. దానిపై ఏడాది నుంచి కసరత్తు సాగుతోంది. దాన్నిపుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది మైత్రీ వారి పేరు పైకి వచ్చిందంటే.

మే నుంచి నెలకు 10 రోజుల వంతున డేట్లు అడ్జస్ట్ చేస్తానని, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో పాటు మీ సినిమా కూడా చేసుకోండని మైత్రీ నిర్మాతలకు పవన్ చెప్పాడన్నది వార్త. చిత్రమేమిటంటే, కాటమరాయుడు చేస్తున్నపుడు కూడా హారిక హాసిని సంస్థను, దర్శకుడు త్రివిక్రమ్ ను కూడా ఇలాగే బ్లాక్ చేసాడు పవన్. 2016 అక్టోబర్ అని, నవంబర్ అని, డిసెంబర్ అని నెలకు పది రోజులు ఇస్తా అనీ అంటూ వచ్చారు. దాంతో వాళ్లు అలా వుండిపోయారు. ఇప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే వాస్తవానికి ఈ ఆరు నెలల్లో మరో సినిమా రెడీ అయిపోయి వుండేది.

ఇప్పుడు అదే ఊరింపు మైత్రీ వాళ్లకు వస్తోంది. అయితే మైత్రీ వాళ్లు గాభరా పడడం లేదు. ఎందుకంటే వాళ్లిపుడు రామ్ చరణ్ సినిమా మీద వున్నారు. సుకుమార్ తో కిందా మీదా అవుతున్నారు. అదే టైపులో మళ్లీ పడాలంటే కష్టమే. ఎందుకంటే పవన్ తో అంత వీజీ కాదు. ఎందుకంటే ఎప్పుడు డెేట్లు ఇస్తారో? ఎప్పుడు క్యాన్సిల్ అంటారో తెలియదు. ఆయన ఓ పక్క రాజకీయాలు చూసుకోవాలి. మరో పక్క ఆరోగ్యం చూసుకోవాలి. అప్పుడు సినిమాలు.