వెండితెరపై సినీ నటి రోజా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన విషయం విదితమే. అగ్ర కథానాయికగా రోజా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఎందుకో ఇప్పుడామె సినిమాల పట్ల అంతగా ఆసక్తి చూపడంలేదు. ఆ మధ్య 'శంభో శివ శంభో', 'గోలీమార్' తదితర సినిమాల్లో నటించిన రోజా, వెండితెర నుంచి అవకాశాలొస్తున్నా బుల్లితెరకే పరిమితమైపోయారిప్పుడు.
రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్నందున, సినిమాల్లో నటించేందుకు టైమ్ లేకుండా పోతోందన్నది రోజా వాదన. అయితే, రాజకీయాల్లో వున్నా, సినిమాల్లో నటిస్తోన్నవారిని చాలామందినే చూస్తున్నాం. మరి, రోజా ఎందుకు సినీ పరిశ్రమకు టైమ్ కేటాయించడంలేదట.? ఏమోగానీ, బుల్లితెరపై రోజా ఓ రేంజ్‌లో సందడి చేస్తుండడం విశేషమే.!
ఇక, బుల్లితెరపై 'రచ్చబండ' కార్యక్రమంతోనూ, టాప్ రేటింగ్ వున్న 'జబర్‌దస్త్' కామెడీ షోతోనూ రోజా, బుల్లితెర వీక్షకుల్ని అలరిస్తూనే వున్నారు. మరీ ముఖ్యంగా 'జబర్‌దస్త్' ప్రోగ్రామ్ కోసం రోజా ఎంట్రీ ఇస్తూ చేసే డాన్సులు అల్టిమేట్ అనే చెప్పాలి. వయసు మీద పడ్తున్నా ఆమె డాన్సుల్లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా పెరిగిందేమో అన్పిస్తుంది. తాజాగా, ఉగాది సందర్భంగా ఓ ఛానల్‌లో వచ్చిన స్పెషల్ ప్రోగ్రామ్‌లో రోజా డాన్సులు కెవ్వు కేక.. అనాల్సిందే. అలా రోజాని చూసినవారెవరైనాసరే, వెండితెరకు ఆమె మొహం చాటేస్తున్నారు.? అని అనుకోకుండా వుండలేరు.
అన్నట్టు, రోజా ఇలా బుల్లితెరపై కన్పించడమే ఆమె రాజకీయ ప్రత్యర్థులకు గిట్టడంలేదనుకోండి.. అది వేరే విషయం.