వరుణ్ తేజ. మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్ అనిపించుకున్నాడు. వైవిధ్యమైన కథాంశాలు ఎన్నుకుంటూ ఇప్పటిదాకా చేసిన సినిమాల కమర్షియల్ సక్సెస్ సంగతి ఎలా వున్నా, మంచి సినిమాలు చేసాడు, మంచి నటుడుగా ఎదుగుతున్నాడు అనిపించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మెల్లగా తన బ్రదర్, హీరో రామ్ చరణ్ ఫ్రభావంలోకి వెళ్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా చరణ్, ఆయన స్టాఫ్ ప్రభావంలో పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రభావంలో పడే, శేఖర్ కమల ఫిదా సినిమా ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా చరణ్ రికమెండేషన్ తో ఒకె చేసినట్లు వినికిడి. కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు వరుణ్ తేజ అని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనికి కారణం ఫిదా సినిమా అనుకున్న రేంజ్ లో రావడం లేదని వరుణ్ అనుకోవడమే. శేఖర్ కమ్ముల కాంటెంపరరీ యూత్ పల్స్ పట్టుకోవడంలో విఫలం అవుతున్నాడని, సబ్జెక్ట్ ఆ దిశగానే వెళ్తోందని తెలుస్తోంది. ఇదే వరుణ్ తేజ్ ను కాస్త ఇబ్బంది పెడుతోందని వినికిడి.
చరణ్ రికమెండేషన్ తో ఓకె అన్న సినిమాతో ఇలా ఫీలవుతున్నా కూడా, వరుణ్ ఇంకా మరి కాస్త అటే ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన టీమ్ అంతటినీ చరణ్ టీమ్ తో రీప్లేస్ చేయాలని అనుకుంటున్నట్లు వినికిడి. మొత్తం మీద మెగా క్యాంప్ చరణ్ ప్లస్ వరుణ్, పవన్ ప్లస్ సాయి ధరమ్, బన్నీ అనే ముచ్చటైన మూడు క్యాంప్ లుగా మారుతున్నట్లు కనిపిస్తోంది.