పూరికి మెగా పిలుపొచ్చిందా.?

అన్నీ అనుకున్నట్టుగా జరిగి వుంటే, పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. అదే, చిరంజీవి కెరీర్‌లో 150వ సినిమా అయి వుండేది. అనూహ్యంగా పూరి జగన్నాథ్‌, ఆ ఛాన్స్‌…

అన్నీ అనుకున్నట్టుగా జరిగి వుంటే, పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. అదే, చిరంజీవి కెరీర్‌లో 150వ సినిమా అయి వుండేది. అనూహ్యంగా పూరి జగన్నాథ్‌, ఆ ఛాన్స్‌ మిస్సయ్యాడు. చిన్న చిన్న 'ఈగో' సమస్యల కారణంగా ఆ సినిమా అటకెక్కిందన్నది అప్పట్లో జోరుగా ప్రచారం జరిగిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, అన్ని సమస్యలూ ఓ కొలిక్కి వచ్చి, తాజాగా రామ్‌చరణ్‌ నుంచి పూరిజగన్నాథ్‌కి 'మెగా' పిలుపు వచ్చిందన్నది టాలీవుడ్‌లో తాజాగా విన్పిస్తోన్న ఖబర్‌. చిరంజీవి ప్రస్తుతం 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమాకి కమిట్‌ అయిన విషయం విదితమే. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. మరి, పూరి – చిరంజీవి కాంబినేషన్‌లో చరణ్‌ ఎప్పుడు సినిమా రూపొందించే ఛాన్సుంది.? ఇది మాత్రం ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

బాలకృష్ణతో సినిమా పనుల్లో పూరి బిజీగా వున్నాడిప్పుడు. మరోపక్క, వెంకటేష్‌ – పూరితో సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు. అంటే, ఇప్పట్లో పూరి – చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా కష్టమే. అయినాసరే, పూరి అనుకుంటే, మెగాస్టార్ కావాలనుకుంటే.. వీరిద్దరి కాంబినేషన్ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళొచ్చు. ఇలా అనుకుంటాడు, అలా సినిమా పట్టాలెక్కించేస్తాడు. దటీజ్‌ పూరి. చరణ్‌ నుంచిగానీ, లేదంటే చిరంజీవి నుంచిగానీ 'పిలుపు' వచ్చాకనే, 'చిరంజీవికి వీరాభిమానిని నేను.. ఖచ్చితంగా చిరంజీవితో సినిమా చేయబోతున్నా..' అనే మాట పూరి నుంచి వచ్చిందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. ఇదెంత నిజమో మరి.!