అతడితో డేటింగ్ తనకు గర్వకారణం అని అంటోంది తాప్సీ. మరి అతడెవరో చెప్పడం లేదు కానీ.. అతడితో ప్రేమయాణం మాత్రం తను గర్వించే అంశం అని తాప్సీ చెప్పుకొచ్చింది. ఇండియాటుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ ఈ విధంగా చెపుకొచ్చింది. తను సింగిల్ కాదు అని తాప్సీ స్పష్టం చేసింది. మరి ప్రేమాయణం ఎవరితో అంటే మాత్రం నోరు విప్పలేదు.
మరి ఇంతకీ తాప్సీ అంతలా గర్వించే ఆమె సన్నిహితుడు ఎవరు అని ఆరా తీస్తే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాతియాస్ బోయ్ పేరు వినిపిస్తోంది. ఒలింపిక్ మెడలిస్ట్ అయిన ఈ ప్లేయర్ తో తాప్సీ ప్రేమయాణం నడుపుతోందని చాన్నాళ్లుగానే వార్తలు వస్తున్నాయి. అయితే తాప్సీ వాటిని ధ్రువీకరించడం లేదు. మరి వ్యక్తిగత జీవితంలో సింగిల్ గా లేను, డేటింగ్ లో ఉన్న వ్యక్తితో గర్వంగా ఉన్నాను అని ఈమె అనడాన్ని బట్టి చూస్తే… ఆ ఒలింపిక్స్ మెడలిస్టుతోనే తాప్సీ ప్రేమలో ఉందని అనుకోవాల్సి వస్తోంది.
ఈ మాట ను తాప్సీ నోటి తోనే వినాలని ప్రయత్నించగా.. ఆ విషయాన్ని పంచుకోనని మాత్రం స్పష్టం చేసింది. మీడియాకు చెబితే.. పదే పదే చూపిస్తుందని తాప్సీ చెప్పుకొచ్చింది. మొత్తానికి అటు కెరీర్ లో విజయాలతో, ఇటు వ్యక్తిగత ప్రేమతో తాప్సీ మేఘాల్లో విహరిస్తున్నట్టుగా ఉంది.