అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు చిన్న, పెద్ద నిర్మాతల హాట్ ఫేవరెట్ గా మారుతున్నారు. దీంట్లో పెద్దగా లాజిక్, మర్మం మరేం లేదు. ఆయన తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలకు ప్లాన్ చేయడం ఒక్కటే కారణం. ఇప్పటికి ఆయన డైరక్షన్ లో చేసిన రెండు సినిమాలు, ఇప్పుడు నటిస్తున్న సినిమా బాబు బాగా బిజీ అన్నీ జస్ట్ మూడు, నాలుగు కోట్ల రేంజ్ లో చేసిన సినిమాలే.
కానీ అవవసరాల సినిమాలకు అమ్మకాలు, కలెక్షన్లు రెండూ బాగానే వున్నాయి. హంటర్ సినిమా రీమేక్ అయినా, అడల్ట్ కంటెంట్ అనిపించుకున్నా బాబు బాగా బిజీకి మంచి మార్కెట్ వచ్చింది. మూడున్నర కోట్లలో ఈ సినిమా ఫినిష్ చేసేసారు. ఒక్క ఆంధ్రనే రెండున్నర నుంచి మూడు కోట్ల మధ్య రేషియోలో అమ్మకాలు సాగించారు. సీడెడ్ తో కలిపి సినిమా సేఫ్ అయిపోయింది. నైజాం, శాటిలైట్ చేతిలో వుంది.
ఇలాంటి సినిమాకు శాటిలైట్ ఎలా వుంటుందో మరి. ఏమైనా నైజాం అన్నది టేబుల్ ప్రాఫిట్ గా మిగిలిపోయింది. అందుకే అవసరాలతో ప్రాజెక్టు చేయాలని ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే అవసరాలు రెండు మూడు ప్రాజెక్టుల కమిట్ అయిపోయారు. హారిక హాసిని వారికి విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేయాల్సి వుంది. సాయి కొర్రపాటికి ఓ సినిమా చేయాల్సి వుంది. అది కాక నానితో ఒకటి వుంది. ఏదైనా ఇలా స్మాల్ బడ్జెట్ లో మంచి ప్రాజెక్టులు చేసే డైరక్టర్లు కావాలి టాలీవుడ్ కు ఇప్పుడు.