ఇవ్వాళ హీరో అన్నంత మాత్రాన అందరికీ కోట్లు కుమ్మరించేయరు. మార్కెట్ బట్టే వుంటుంది. చెల్లింపులు. రాజ్ తరుణ్ కు కోటి అయినా, మహేష్ లాంటి వారికి ఇరవై కోట్లు అయినా. అప్ కమింగ్ బడ్డీస్ కు లక్షల్లో వుంటుంది. ఇరవై, నలభై, అరవై అలా. అయితే కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు అనే రెండు కమర్షియల్ సక్సెస్ లు వున్న అల్లు శిరీష్ కు అప్పుడే కోటి రెమ్యూనిరేషన్ దక్కేసింది.
స్వామిరారా లాంటి హిట్ సినిమాను నిర్మించిన చక్రి చిగురుపాటి ఓ సినిమా ప్లాన్ చేసారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ ఆనంద్ తో. అది కూడా సైన్స్ ఫిక్షన్. ఈ సినిమాకు అల్లు శిరీష్ ను హీరోగా ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా కోసం శిరీష్ కు కోటి రూపాయిల రెమ్యూనిరేషన్ ఇచ్చారని వినికిడి.
వాస్తవంగా ఇది కాస్త పెద్ద ఫిగరే అనుకోవాలి శిరీష్ రేంజ్ కు. అలా అంటే శిరీష్ బ్యాచ్ కు ఇబ్బందిగా వుండొచ్చు కానీ, వాస్తవమేగా. శ్రీరస్తు శుభమస్తు విజయం వెనుక డైరక్టర్ పరుశురామ్ కృషి, నిర్మాత అరవింద్ సలహాలు, మార్పులు చేర్పులు ఇలా చాలా వున్నాయి. కానీ ఆ హిట్ పుణ్యమా అని శిరీష్ కోటికి పడగెత్తేసాడు. బహుశా మళయాళంలో కూడా మోహన్ లాల్ తో ఓ సినిమా చేస్తూ పరిచయం అవుతున్నాడు. అందువల్ల రెండు లాంగ్వేజ్ లకు మార్కెటింగ్ కి పనికి వస్తాడని ఆ రెమ్యూనిరేషన్ ఇచ్చారేమో ?