నెగిటివ్ క్యారెక్టర్ లో ఎలా వుంటాడో?

హీరోలు అంటే మన సినిమా ఫ్యాన్స్ కు ఎప్పటికీ హీరోలే. కానీ మన హీరోలకు అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్ వున్న క్యారెక్టర్లు వేయాలని వుంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ తో సహా దాదాపు…

హీరోలు అంటే మన సినిమా ఫ్యాన్స్ కు ఎప్పటికీ హీరోలే. కానీ మన హీరోలకు అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్ వున్న క్యారెక్టర్లు వేయాలని వుంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ తో సహా దాదాపు ప్రతి హీరో ఇలాంటి నెగిటివ్ షేడ్ వున్న క్యారెక్టర్లు తమ కెరీర్ ఎప్పుడో ఒకప్పుడు వేసిన వారే. మెగాస్టార్ చిరంజీవి అయితే తన కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ వేసారు. మోహన్ బాబు, శ్రీకాంత్ తమ కెరీర్ ను నెగిటివ్ పాత్రలతోనే ప్రారంభించారు. అల్లరి నరేష్ ఒకటి రెండు సార్లు ఈ ప్రయత్నం చేసారు.

ప్రస్తుతానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఈ పనిలో దిగారు. నెగిటివ్ షేడ్ వున్న పాత్రను ఆయన వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలోనే ఆయన ఈ ముచ్చట తీర్చుకుంటున్నారు. బాబీ డైరక్షన్ లో జయ్, లవ, కుశ సినిమా చేస్తున్నారు. ఇందులో మూడు పాత్రలు వున్నాయి. వాటిలో ఒకటి కాస్త నెగిటివ్ షేడ్ వున్న పాత్ర.

ఎన్టీఆర్ ఇప్పటి వరకు హీరోగానే మెప్పించారు. మరి విలన్ గా అంటే ఎలా వుంటారో? ఎన్టీఆర్ మంచి నటుడు. అందులో సందేహం లేదు. అందువల్ల నెగిటివ్ క్యారెక్టర్ కూడా బాగానే పండిస్తారు. కానీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.