నందమూరి కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే అవుతారంట. అది కూడా సవాల్ చేసి మరీ. ఏమిటిదంతా అంటే త్వరలో ఆయన చేయబోయే సినిమానే. శ్రీనువైట్ల, ఇంకా పలువురి దగ్గర పని చేసిన ఉపేంద్ర అనే అసిస్టెంట్ తయారు చేసిన కథకు కళ్యాణ్ రామ్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.
చిత్రమేమిటంటే, ఈ కథ హీరోగా మారిన సునీల్ కోసం, అతని బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన కథ. అది ఇప్పుడు కళ్యాణ్ రామ్ కు అనుగుణంగా మారుస్తున్నారు. ఓ ఎంపీతో సవాల్ చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ, ఇంటింటికి మందు పథకం లాంటి ఫన్నీ వ్యవహారాలతో ఎమ్మెల్యేగా నెగ్గడం అన్న పాయింట్ తో వుంటుందని వినికిడి.
ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు వున్న అబ్బాయి అన్న మరో మీనింగ్ కూడా వుంటుందట. అయితే సునీల్ కోసం ఇందులో ఓ మెడ్ లే కూడా వుంటుందట. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఇలా పలువురు పాపులర్ హీరోలను ఇమిటేట్ చేయడం లాంటిది. అంటే ఓ విధంగా స్ఫూఫ్ అన్నమాట. అయితే మరి ఇలాంటివి సునీల్ కు అయితే నప్పుతాయి.కళ్యాణ్ రామ్ కు ఏ విధంగా మారుస్తారో? సినిమాపై శ్రీనువైట్ల స్టయిల్ ప్రభావం కొంతవున్నట్లు కనిపిస్తోంది.