సాధారణంగా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చే భామలెవరూ ఎక్స్ పోజింగ్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే, అప్పటికే తమ తండ్రి లేదా తాతకు ఓ ఇమేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని చెడగొట్టడం ఇష్టంలేక హాట్ గా కనిపించడానికి మొహమాటపడతారు. అయితే నటుడు ఉత్తేజ్ తనయ చేతనా ఉత్తేజ్ మాత్రం ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకుంది.
ప్రస్తుతం చేతనా ఉత్తేజ్, పిచ్చిగా నచ్చావ్ అనే సినిమా చేసింది. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఓ డిఫరెంట్ మూవీ అంటూ ప్రచారం బాగానే కల్పిస్తున్నారు. కానీ ప్రయోజనం మాత్రం అంతంతమాత్రమే. ఉత్తేజ్ కూతురు హీరోయిన్ గా నటించిందనే ఎలిమెంట్ కూడా వర్కవుట్ కాలేదు. కానీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రోమో మాత్రం పిచ్చిగా నచ్చావ్ సినిమాకు పిచ్చ ప్రమోషన్ తెచ్చిపెడుతోంది.
పిచ్చిగా నచ్చావ్ ప్రమోషన్ లో భాగంగా చేతనా ఉత్తేజ్ నటించిన ఓ హాట్ సాంగ్ క్లిప్ ను విడుదల చేశారు. నిన్నమొన్నటివరకు పద్ధతిగా, ముద్దుగా కనిపించిన ఉత్తేజ్ డాటర్ ఇలా ఒక్కసారిగా హాట్ గా మెరిసేసరికి అంతా అవాక్కయ్యారు. కనీసం ఈ రొమాంటిక్ ప్రోమో అయినా థియేటర్లకు జనాల్ని రప్పిస్తుందేమో చూడాలి.