ఇండస్ట్రీకి ఏ హీరోయిన్ వచ్చినా మెగా కాంపౌండ్ లోకి వెళ్లాలని అనుకుంటుంది. ఎందుకంటే అక్కడ హీరోల సంఖ్య ఎక్కువ. కాంపౌండ్ లోకి ఒక్కసారి ఎంటర్ అయితే.. ఒక రిఫరెన్స్ తో మరో హీరో సరసన కూడా ఛాన్స్ కొట్టేయొచ్చు. అందుకే ముద్దుగుమ్మలందరికీ మెగా హీరోలంటే చాలా ఇష్టం. ఇప్పుడు కొందరు భామలు మెగాహీరోల సరసన స్థానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
త్వరలోనే వక్కంతం వంశీ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు బన్నీ. ఈ సినిమాలో హీరోయిన్ పొజిషన్ కోసం కీర్తి సురేష్, శృతిహాసన్ పోటీపడుతున్నారట. ఇప్పటికే బన్నీతో రేసుగుర్రం సినిమా చేసింది శృతిహాసన్. కాబట్టి ఆమెకు ఈజీగానే ఛాన్స్ దొరకొచ్చు. కానీ ఫ్రెష్ కాంబినేషన్ కోరుకుంటే మాత్రం కీర్తి సురేష్ కు ఛాన్స్ గ్యారెంటీ.
అటు రామ్ చరణ్ సినిమా కోసం కూడా పోటీ తీవ్రంగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చెర్రీ. ఓవైపు చరణ్, మరోవైపు మణిరత్నం.. ఇలాంటి ఛాన్స్ ఎవరు వదులుకుంటారు చెప్పండి. అందుకే సీనియర్లయిన కాజల్, తమన్న ఈ బెర్త్ కోసం పోటీపడుతున్నారట. ఇద్దరికీ చరణ్ తో పరిచయం ఉంది కాబట్టి పని ఈజీగా అయిపోతుందని ఎవరైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ మణిరత్నం ఆలోచనలు మాత్రం ఫ్రెష్ కాంబినేషన్ సెట్ చేయడంపైనే ఉన్నాయని తెలుస్తోంది.
ఈ హీరోయిన్లతో పాటు లావణ్య త్రిపాఠి, ప్రగ్యా జైశ్వాల్, రెజీనా లాంటి భామలు కూడా ఇప్పటికే మెగా కాంపౌండ్ లోకి ఎంటరయ్యారు. మరి వీళ్లలో ఎంతమంది బన్నీ, చెర్రీతో స్క్రీన్ షేర్ చేసుకుంటారో చూడాలి.