Advertisement


Home > Movies - Movie Gossip
మెగాస్టార్ చిత్రానికి జాతీయ పురస్కారం!!

మెగాస్టార్ చిరంజీవి ఈ దఫా తన తాజా చిత్రానికి జాతీయ పురస్కారం అందుకోబోతున్నారా? సినిమా జాతీయ అవార్డులకు సంబంధించి.. కసరత్తు జరుగుతున్న ప్రస్తుత సమయంలో తన 150వ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి కూడా నేషనల్ అవార్డు గ్యారంటీ అనే ప్రచారమూ నడుస్తోంది. ఖైదీనెంబర్ 150వ చిత్రాన్ని జాతీయ పురస్కారాలకు దరఖాస్తు చేశారు. 2016 కోటాలో ఈ చిత్రాన్ని అవార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి సినిమా జనవరిలో విడుదల అయినప్పటికీ 2016లోనే సెన్సార్ పూర్తి చేసుకున్న కారణంగా ఆ ఏడాది కోటాలో పోటీకి పంపినట్లుగా తెలుస్తోంది. 

జాతీయ అవార్డు మీద కన్నేయడం వల్లనే మెగాస్టార్ చిత్రం ఖైదీ నెంబర్ 150కు డిసెంబరులోనే చాలా హడావుడిగా సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేయించేశారని... కనీసం రీరికార్డింగ్ కూడా పూర్తి కాకుండానే సెన్సార్ డిసెంబరులో (2016లో) అయిందనిపించేసి , ఆ తర్వాత మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు తాపీగా చేసుకున్నారని... ఇదంతా కూడా 2016 కోటాలో నేషనల్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికేనని తెలుస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. పార్టీలు వేరైనప్పటికీ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వంలోని భాజపా పెద్దలతో సత్సంబంధాలూ ఉన్నాయి. ప్రత్యేకించి వెంకయ్యనాయుడుతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ కు తన రీఎంట్రీని మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ నేషనల్ అవార్డ్ తప్పదనే మాట ఫిలింనగర్ లో వినిపిస్తోంది.