మహేష్ సినిమాను చెక్కుతున్నారంట

రీజన్ లు ఏవయినా వుండొచ్చు, కానీ మహేష్ బాబు-మురగదాస్ సినిమా రాను రాను దాని చార్మ్ ను కోల్పొతోంది అనిపిస్తోంది. ఆ సినిమా ప్రారంభంలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. నూట పాతిక కోట్ల మార్కెట్…

రీజన్ లు ఏవయినా వుండొచ్చు, కానీ మహేష్ బాబు-మురగదాస్ సినిమా రాను రాను దాని చార్మ్ ను కోల్పొతోంది అనిపిస్తోంది. ఆ సినిమా ప్రారంభంలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. నూట పాతిక కోట్ల మార్కెట్ అన్న టాక్ వినిపించింది. కానీ రాను రాను ఇప్పుడు ఆ సినిమాను పట్టించుకోవడం తగ్గిపోతోంది. అది ఎప్పుడు వస్తుందో? జూన్ అని డేట్ ఇచ్చారు కానీ అన్న కామెంట్ లు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం మరేమీ లేదు. మురగదాస్ తప్ప వేరుకాదట. మురగదాస్ లాంటి ఏస్ డైరక్టర్ ను పెట్టుకోవడంతో ఇక నిర్మాతలకు చేతులు కట్టేసినట్లయింది. ఏ నిర్ణయమూ వారి చేతిలో లేకుండా పోయింది. కేవలం దర్శకుడు, హీరో మాత్రమే డెసిషన్ మేకర్స్ అవడంతో, వాళ్లు అనుకున్న ప్రకారం షెడ్యూల్ వేయడం, వాళ్లు అనుకున్న ప్రకారం షాట్ లు తీయడం తప్ప మరో మాట వుండడం లేదట. అలాగే టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ అవన్నీ కూడా మురగదాస్ ఇష్టంలోనే వుండిపోయింది.

సంభవామి టైటిల్ ఆల్ మోస్ట్ డిసైడ్ చేసి కూడా, తరువాత అనౌన్స్ చేద్దాం, ఇప్పటి నుంచీ తొందర ఏముంది అని మురగదాస్ అనడంతో ఆగిపోయింది. దీనికి తోడు ఈ సినిమాను తమిళ తెలుగు భాషల్లో రూపొందించడమే పెద్ద సమస్యగా మారిందట. ఖర్చును పెంచేస్తోందట.

ఇరు భాషల్లోనూ దాదాపు నటులంతా ఒకటే అయినా కూడా, ప్రతి సీన్ రెండుసార్లు తీస్తున్నారని వినికిడి. తెలుగు లిప్ సింక్ వేరు, తమిళ లిప్ సింక్ వేరు అని చెప్పి, ప్రతి సీన్ అదే నటులతో రెండుసార్లు తీస్తున్నారట. రెండుసార్లు తీసినపుడల్లా, పెర్ ఫెక్షన్ కోసం రెండు మూడు టేక్ లు ఇలా చేయడంతో షూటింగ్ చకచకా నడవడం లేదట. పైగా దానివల్ల ఖర్చు బాగా పెరిగిపోతోందట. అసలే మురగదాస్ 20 కోట్లు, మహేష్ 20 కోట్లు తీసుకున్నారు. పైగా టెక్నీషియన్లు కూడా కాస్ట్ లీనే.

ప్రారంభంలో బడ్జెట్ వందకోట్లు అనుకున్నారు కానీ దాటేస్తోందని వినికిడి. ఇప్పటికి శాటిలైట్ తప్ప వేరు అమ్మింది లేదు. ఒక టీజర్ నో, ఫస్ట్ లుక్ నో విడుదల చేస్తే తప్ప 125 కోట్ల మేరకు అమ్మకాలు సాగడం అంటే చాలాకష్టం. పైగా మురగదాస్ తెలుగులో నేరుగా అద్భుతమైన విజయాలు ఏవీ సాధించలేదు. తుపాకి సినిమా పేరు తెచ్చింది కానీ తెలుగులో పైసలు తేలేదు. పైగా మహేష్ సినిమా ఏమన్నా కొత్త కథనా అంటే అదీకాదు. చేస్తున్నది తుపాకి 2 సినిమానే. సీక్వెల్ అని కాకుండా వేరుగా చేస్తున్నారంతే.

ఇలాంటి నేపథ్యంలో మహేష్ చరిష్మాను నమ్ముకుని ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్న నిర్మాతల పరిస్థితి ఆలోచించకుండా, మురుగదాస్ టైటిల్ ను, టీజర్ ను మురగబెడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే బ్రహ్మోత్సవం అనుభవం బయ్యర్లు మరిచిపోలేదు కూడా.

మరి మురగదాస్ ఈ మహేష్ సినిమాను ఏం చేస్తారో మరి?