ఇలా సెట్స్ పైకి వచ్చిందో లేదో అలా పుకార్లు ప్రారంభమయ్యాయి బాలయ్య సినిమాపై. సెట్స్ పైకి వచ్చి 24 గంటలైనా గడవక ముందే బాలయ్య-పూరి సినిమాపై ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని, పూరి జగన్నాధ్ సస్పెన్స్ గా ఉంచుతున్న వేళ… క్లైమాక్స్ ఇదేనంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది.
టెంపర్ సినిమా తరహాలోనే బాలకృష్ణ సినిమా కూడా క్లయిమాక్స్ కు వచ్చేసరికి కోర్టుకు చేరుతుందట. అప్పటివరకు ఎమోషనల్ గా సాగే సినిమా, కోర్టుకు వచ్చేసరికి మరింత ఎమోషనల్ గా మారుతుందట. టెంపర్ లో కోర్టు సీన్ ఎంత హైలెట్ అయిందో, బాలయ్య కొత్త సినిమాలో కోర్టు సీన్ అంతకంటే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొత్త క్యారెక్టర్ లో మేనరిజమ్స్ కు బాలకృష్ణ అలవాటు పడిన తర్వాత, ఈ క్లయిమాక్స్ షూటింగ్ ఉంటుందట.
టెంపర్ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. ఆ కథకు తనదైన టచ్ ఇచ్చాడు పూరి. కానీ బాలకృష్ణ సినిమాకు మాత్రం కథ పూరి జగన్నాధ్ దే. తన సొంత కథలతో ఈమధ్య ఈ దర్శకుడు తీసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అయితే బాలకృష్ణ సినిమాకు మాత్రం పక్కా స్టోరీలైన్, క్యారెక్టరైజేషన్ తో పూరి రెడీ అయ్యాడట. క్లయిమాక్స్ నచ్చడం వల్లనే ఈ సినిమా చేసేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నారట.