క్యారెక్టర్ కోసం మహేష్ ఎలాంటి మేకోవర్ కైనా రెడీ అవుతాడు. వన్-నేనొక్కడినే సినిమాలో ఫిట్ గా కనిపించడం కోసం ఫారిన్ ట్రయినర్ పర్యవేక్షణలో కసరత్తులు కూడా చేశాడు. మురుగదాస్ సినిమా కోసం ఈ హీరో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించలేదు. అయినా కూడా మహేష్ మారిపోయాడు. టాలీవుడ్ లో నిన్న జరిగిన 2 ఈవెంట్లకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు మహేష్. చాన్నాళ్ల తర్వాత మహేష్ ను చూసిన జనాలు షాక్ అయ్యారు. అవును… మహేష్ చాలా సన్నగా అయిపోయాడు.
మొన్నటివరకు కాస్త కండ పట్టి నిండుగా కనిపించేవాడు ఈ హీరో. బ్రహ్మోత్సవం సినిమాలో బాగానే ఉన్నాడు. ఆ సినిమా విడుదల తర్వాత కూడా మహేష్ ఫిజిక్ లో పెద్దగా మార్పులు కనిపించలేదు. విదేశాల్లో ఉన్నప్పుడు విడుదలైన ఫొటోలు, మురుగదాస్ తో సినిమా స్టార్ట్ చేసిన కొత్తలో కూడా మహేష్ బాగానే ఉన్నాడు. కానీ ఇంతలోనే సడెన్ గా స్లిమ్ అయిపోయాడు ఈ హీరో.
మురుగదాస్ సినిమా కోసమే మహేష్ ఇలా స్లిమ్ గా మారాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం, రెస్ట్ లేకుండా పనిచేయడం వల్లనే మహేష్ ఇలా తయారయ్యాడని అంటున్నారు. మురుగదాస్ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాడు మహేష్. ఇది చాలదన్నట్టు మధ్యమధ్యలో యాడ్ షూటింగ్స్. అందుకే మహేష్ చిక్కిపోయాడని అంటున్నారు.