కాటమరాయుడు ఫంక్షన్ స్పెషల్ అదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ప్రీ రిలీజ్ మీట్ ఈనెల 18న జరగబోతోంది. ఈ ఫంక్షన్ కు ఓ ప్రత్యేకత వుందట. వాస్తవానికి ఆ ప్రత్యేకత మీదే ఫంక్షన్ చేద్దామంటే పవన్ కళ్యాణ్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ప్రీ రిలీజ్ మీట్ ఈనెల 18న జరగబోతోంది. ఈ ఫంక్షన్ కు ఓ ప్రత్యేకత వుందట. వాస్తవానికి ఆ ప్రత్యేకత మీదే ఫంక్షన్ చేద్దామంటే పవన్ కళ్యాణ్ వద్దన్నారట. కావాలంటే ఫంక్షన్ లో అదో పార్ట్ గా చేసుకోమని అన్నారట. సో ఆ మేరకు ప్లాన్ చేస్తున్నారట.

ఇంతకీ ఆ ప్రత్యేకత ఏమిటంటే, పవన్ సినిమా రంగంలోకి వచ్చి రెండు దశాబ్ధాలు పూర్తికావడం. 2007లో పవన్ తొలిసినిమా విడుదలయింది. ఇప్పటికి 20 ఏళ్లయిందన్న మాట. అందుకే సినిమా రంగంలో రెండు దశాబ్ధాల పేరట ఫంక్షన్ చేయాలని అభిమానులు సూచించారట. అయితే పవన్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడట. కావాలంటే కాటమరాయుడు విడుదల పంక్షన్ లో  దానిపై ఓ ఎవీ లేదా చిన్న ప్రోగ్రామ్ చేసుకోమన్నాడట. సో ఆ మేరకు 18న పంక్షన్ సమ్ థింగ్ స్పెషల్ ఫర్ పవన్ ఫ్యాన్స్ కాబోతోంది.