పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాంచి స్పీడ్ మీద వున్నారు. కాటమరాయుడు పూర్తి చేసేసారు. జూన్ నుంచి పార్టీ పనులు ప్రకటించేసారు. అందువల్ల జూన్ లోగా మరో సినిమా వీలయినంత ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఏప్రిల్ 3 నుంచి కొత్త సినిమా మీదకు వెళ్లిపోతున్నారు. డైరక్టర్ త్రివిక్రమ్ తో హారిక హాసిని బ్యానర్ లో చేయబోయే సినిమా షూట్ 3న ప్రారంభిస్తారట. తాను ఆ రోజు నుంచే రెడీ అని పవన్ చెప్పేసారట.
అయితే ఈ సినిమాకు ఓ భారీ ఆఫీసు లోకేషన్ కావాలి. పైగా ఒకేలాంటి రెండు ఆఫీసులు, అదీ పక్కపక్కన. దాని కోసం గాలిస్తున్నారు. ఏకంగా సెట్ నే వేసేద్దాం అంటున్నారట త్రివిక్రమ్. అంటే కనీసం కోటి నుంచి రెండు కోట్ల ఖర్చు అన్నమాట. మరి అలాగే చేస్తారో? ఆఫీస్ కోసం వెదుకులాడతారో చూడాలి.