ఈ దర్శకుడికి ఇక అవకాశం కష్టమే

పవన్ తో ఎవరైనా సినిమా చేయాలనుకుంటే ఇదే రైట్ టైం. ఒకప్పుడు స్టోరీ డిస్కషన్, స్క్రీన్ ప్లే అంటూ చాలా రోజులు టైం తీసుకునే పవన్, ఇప్పుడు వెంటవెంటనే ఓకే చెప్పేస్తున్నాడు. అలాఅని కథల…

పవన్ తో ఎవరైనా సినిమా చేయాలనుకుంటే ఇదే రైట్ టైం. ఒకప్పుడు స్టోరీ డిస్కషన్, స్క్రీన్ ప్లే అంటూ చాలా రోజులు టైం తీసుకునే పవన్, ఇప్పుడు వెంటవెంటనే ఓకే చెప్పేస్తున్నాడు. అలాఅని కథల విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు కానీ… మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచి, మరికొన్ని విషయాల్లో తన ప్రమేయం తగ్గించాడు. కాటమరాయుడు ఇంత వేగంగా రెడీ అవ్వడానికి కారణం ఇదే. త్వరలోనే కొరటాల, నేసన్ సినిమాల్ని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు పవన్. అయితే పవన్ స్పీడ్ పెంచినా ఓ దర్శకుడికి మాత్రం ఛాన్స్ కష్టమే అంటున్నారు. అతడే కరుణాకరన్.

పవన్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమాతో పవన్ ఇమేజ్ మరింత పెరిగింది. తన కెరీర్ లో తొలిప్రేమను ఇప్పటికీ సంథింగ్ స్పెషల్ మూవీగా చెప్పుకుంటాడు పవన్. అందుకే ఆ సినిమాను డైరక్ట్ చేసిన కరుణాకరన్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సెకెండ్ ఛాన్స్ ను మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు కరుణాకరన్. అప్పట్నుంచి పవన్ తో మరో సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

తాజాగా సినిమాల విషయంలో పవన్ స్పీడ్ పెంచడంతో ఆ మధ్య మరోసారి పవన్ ను కలిశాడట కరుణాకరన్. త్రివిక్రమ్, నేసన్ కథల్ని వింటున్న టైమ్ లోనే కరుణాకరన్ కు కూడా ఛాన్స్ ఇచ్చాడట పవన్. కథ బాగుంటే ఏఎం రత్నం సినిమాను నేసన్ కు కాకుండా, కరుణాకరన్ కే అప్పగించాలని అనుకున్నాడట. కానీ ఈ దర్శకుడు మాత్రం తన స్టోరీలైన్స్ తో పవన్ ను మెప్పించలేకపోయాడని తెలుస్తోంది. మరోవైపు పవన్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టడంతో… భవిష్యత్తులో కరుణాకరన్ కు మరో ఛాన్స్ కష్టమే అనిపిస్తోంది.