ఉద్దేశ్యం ఏదైనా, కొన్ని పదాలు జుగుప్సాకరంగా వుంటాయి. సెలబ్రిటీలు అలాంటి పదాల్ని ఉపయోగించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వుంటుంది. కానీ, ఆయన రామ్‌గోపాల్ వర్మ. ఆయనకు ఏది ఎలా ఇష్టమైతే అలా మాట్లాడేస్తాడు. సోషల్ మీడియాలో అయితే, వర్మకి హద్దూ అదుపూ లేకుండా పోతుంది.
తాజాగా వర్మ 'బాహుబలి-2' ట్రైలర్‌పై సోషల్ మీడియాలో స్పందించాడు. అలా ఇలా కాదు, ఓ రేంజ్‌లో. 'ట్రైలర్ ఆఫ్ నాట్ మదర్ ఆఫ్ మూవీస్, బట్ ది ఫకింగ్ గ్రాండ్ మదర్ ఆఫ్ మూవీస్.. ఎ మెగాబాహుబలియన్ సెల్యూట్ టు ఎస్ రాజమౌళి..' అన్నది వర్మ, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్. రాజమౌళికి మెగాబాహుబలియన్ సెల్యూట్ వరకూ బాగానే వుంది. 'మదర్ ఆఫ్ మూవీస్..' అనడం వరకూ ఎలాంటి అభ్యంతరాల్లేవు. కానీ, 'ది ఫకింగ్ గ్రాండ్ మదర్ ఆఫ్ మూవీస్..' అనడమేంటట.?
'ఎంత గొప్పగా ప్రశంసించేసినారే, దానికి కిక్ వుండదు.. కాస్తంత మసాలా జోడించాలి.. అది అసభ్యంగా వున్నాసరే ఫర్లేదు.. అప్పుడే మన స్పందనకు ప్రతిస్పందన ఇంకా గట్టిగా వస్తుంది..' అన్నది వర్మ స్ట్రాటజీ. పొగడ్తలో కూడా తిట్లు.. దటీజ్ రామ్‌గోపాల్ వర్మ. ఏమన్నా అంటే, మళ్ళీ ఇప్పుడు డిక్షనరీ చూసుకోమనో.. ఇంగ్లీషు నేర్చుకోమనో పాఠాలు చెబుతాడేమో.!
ఒక్కటి మాత్రం నిజం, 'బాహుబలి ది కంక్లూజన్' టీజర్ అదిరిపోయింది. యాక్షన్ ప్యాక్‌డ్, విజువల్ వండర్ అన్పిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ సహా వివిధ భాషల్లో సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దరిమిలా.. ట్రైలర్‌తో, అప్పుడే రికార్డుల పండుగ షురూ అయ్యిందని చెప్పొచ్చు.