క్రిష్ తన ట్రేడ్ మార్క్ వదిలేసినట్టేనా

గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి… ఇలా క్రిష్ తెరకెక్కించిన ఏ సినిమా టైటిల్ చూసినా అందులో కొంత ఫిలాసఫీ కనిపిస్తుంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను మినహాయిస్తే…

గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి… ఇలా క్రిష్ తెరకెక్కించిన ఏ సినిమా టైటిల్ చూసినా అందులో కొంత ఫిలాసఫీ కనిపిస్తుంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను మినహాయిస్తే క్రిష్ మూవీస్ అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కాస్త మెసేజ్ ఇచ్చేలా ఉంటాయి. తను నమ్మిందే తీస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించిన ఈ డిఫరెంట్ డైరక్టర్, ఇప్పుడు తన ట్రేడ్ మార్క్ ను పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది.

గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు క్రిష్. ఈ గ్యాప్ లో క్రిష్ పై చాలా రూమర్లు వచ్చాయి. మరో బడా హీరోతో సినిమా చేయాలనే ఉద్దేశంలో క్రిష్ ఉన్నట్టు.. అయితే అతడు చెప్పిన కథలను వెంకీ, చిరు లాంటి హీరోలు రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి క్రిష్ ఇన్నాళ్లూ యాడ్ షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడే మళ్లీ తన కొత్త సినిమా పనిలో పడ్డాడు. ఆ మూవీకి చోర అనే టైటిల్ పెట్టాడట.

ఇన్నాళ్లు క్రిష్ తీసిన సినిమాలకు భిన్నంగా చోర సినిమా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రానుందట. ఈ మేరకు ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ కొడుతున్న ఓ మీడియం రేంజ్ హీరోతో క్రిష్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ తన ట్రేడ్ మార్క్ కథల్ని వదులుకోవడానికి కారణం ఏంటనేది అతడికే తెలియాలి.