ప్రేమమ్ లో అక్కినేని హీరో సరసన నటించింది అనుపమ పరమేశ్వరన్. మళ్లీ మరోసారి అక్కినేని హీరోసరసన కాదు కానీ, వాళ్ల బ్యానర్ లో నటించబోతోంది. అక్కినేని నాగార్జున-నిఖిల్ కాంబినేషన్ లో చందుమొండేటి డైరక్షన్ లో ప్రారంభించబోయే సినిమా కోసం అనుపమను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ప్రారంభం కాలేదు. స్క్రిప్ట్ ఓకే అయింది. మెయిన్ కాస్టింగ్ ఓకె అయింది.
ప్రస్తుతం రాజుగారి గది-2 సినిమా మీద బిజీగా వున్న నాగార్జున మార్చి, ఏప్రెల్ లో ఖాళీగా వుంటారు. మే లేదా జూన్ లో మళ్లీ రాజుగారి గది-2 సినిమా కోసం పాండిచ్చేరి వెళ్లి, బీచ్ లొకేషన్లలో షూట్ చేసుకుని వస్తారు. అందువల్ల ఈ గ్యాప్ లో ఐ డ్రీమ్ బ్యానర్ పై ఈ సినిమా స్టార్ట్ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో వున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఏ విషయం తెలిసిపోతుంది. ప్రస్తుతం కేశవ సినిమా ఫినిష్ చేసి నిఖిల్ ఖాళీగానే వున్నాడు. నాగ్ సినిమా డేట్ లు వగైరా సెటిల్ అయితే, అప్పుడు మిగిలిన ప్రాజెక్టుల మీద డెసిషన్ తీసుకుంటాడు.
అనుపమ ఇప్పటికి మూడు హిట్ లు కొట్టింది. టూ క్యూట్ లుక్స్ వల్ల రామ చరణ్ సరసన హీరోయిన్ చాన్స్ కొంచెంలో తప్పి పోయింది. అయినా అనుపమకు తెలుగులో మాంచి ప్యాన్ ఫాలోయింగ్ వుంది. అందుకే ఇప్పుడు నాగ్ సినిమాలోకి ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే డైరక్టర్ చందుతో కలిసి ఆమె ప్రేమమ్ సినిమాలో నటించింది.