సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ హల్ చల్ చేస్తుందో చెప్పలేం. ఓవైపు కాటమరాయుడు సినిమా హంగామా కొనసాగుతుండగానే సడెన్ గా అఖిల్ తెరపైకి వచ్చాడు. అతడి కొత్త సినిమాకు జున్ను అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ తెగ డిస్కషన్ జరిగింది. విక్రమ్ కుమార్ సినిమాలన్నీ కొత్తగా ఉంటాయి. సో.. అఖిల్ సినిమాకు జున్ను అనే టైటిల్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు చాలామంది.
అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై వచ్చేనెల 1 నుంచి ఈ కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో అఖిల్ పాత్ర పేరు జున్ను అని తెలుస్తోంది. సినిమాలో అంతా అఖిల్ ను జున్ను అనే పిలుస్తారట. అందుకే ఇదే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. మొదటి సినిమాకు తన రియల్ నేమ్ నే సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు అఖిల్. ఇప్పుడు రెండో సినిమాకు తన క్యారెక్టర్ పేరును టైటిల్ గా ఫిక్స్ చేసుకుంటాడేమో చూడాలి.
ఇప్పటికే స్క్రీన్ ప్లే లాక్ చేసిన ఈ సినిమాకు హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ను తీసుకున్నారు. అయితే జున్ను అనే టైటిల్ ను మాత్రం ఎవరూ ఇంకా రిజిస్టర్ చేయించలేదు.