అంజలా ఝవేరి గుర్తుందిగా. కలిసుందాం రా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి, దాదాపు అందరు హీరోలతో నటించి మాంచి హిట్ లు ఇచ్చిన హీరోయిన్. ఆమె భర్తే తరుణ్ అరోరా. మాంచి లుక్స్, ఫిజిక్ తో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150లో విలన్ గా ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్ లు చాలా మంది ఇప్పుడు ఇతగాడిని విలన్ గా పెట్టుకోవాలని చూస్తున్నారు.
అయితే ఇప్పటికే మరో సినిమాలో కూడా విలన్ గా చేసేసాడు. అది మరే హీరోతోనో కాదు, మెగా బ్రదర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే. పవర్ స్టార్ కాటమరాయుడులో కూడా తరుణ్ అరోరా వున్నాడు. నిజానికి పవన్ నే ఈ తరుణ్ అరోరాను అన్న చిరంజీవికి పరిచయం చేసింది. తనతో పాటు సర్దార్ లో చేసిన కాజల్ ను హీరోయిన్ గా, ఆలీని కమెడియన్ గా పవన్ నే రికమెండ్ చేసారని అప్పట్లో టాక్ వినిపించింది.
అలాగే తను కాటమరాయుడు కోసం తీసుకున్న తరుణ్ ను అన్న సినిమాకు విలన్ గా అందించాడు. అక్కడ లక్ బాగానే వుంది సినిమా మంచి హిట్ అయింది. మరి ఇప్పుడు అదే విలన్ పవన్ కు కూడా మాంచి హిట్ ఇస్తాడేమో చూడాలి. అసలే సెంటిమెంట్ లే కదా టాలీవుడ్ నిండా.