దర్శకుడు పూరిజగన్నాధ్ ఇప్పటికే కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు. ఇద్దరు ముద్దుగుమ్మలు కావాలంటూ… తను-చార్మి కలిసి పెట్టిన కంపెనీపై ప్రకటన ఇచ్చాడు. కానీ బాలయ్య సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై పూరి ఇప్పటికే మైండ్ లో కొందరు ముద్దుగుమ్మలను ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ముంబయికి చెందిన ఓ మోడల్ కమ్ నటిని బాలయ్య సినిమా కోసం హీరోయిన్ గా తీసుకుంటున్నారని టాక్.
తన సినిమాలతో ఇప్పటికే చాలామంది నార్త్ బ్యూటీస్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు పూరి. లోఫర్ తో దిశా పటానీ, ఇజమ్ తో అదితి ఆర్యను ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఈ దర్శకుడు… రోగ్ తో ఏంజెలా అనే ముద్దుగుమ్మను కూడా పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే కోవలో బాలకృష్ణ సినిమాతో మరో ఉత్తరాది భామను తెలుగుతెరకు పరిచయం చేయబోతున్నాడట. అయితే ఆ అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుతున్నారు.
నిజానికి బాలకృష్ణ సినిమా కోసం ఇప్పటికే కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను ఫైనలైజ్ చేశాడు పూరి. తనకున్న పరిచయాల ఆధారంగా ఇద్దరుముగ్గురు బాలీవుడ్ భామల పేర్లను అనుకున్నాడట. వాళ్లలో సోనాక్షి సిన్హా, కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. వీళ్లతో పాటు మరో ఇద్దరు కొత్తమ్మాయిల్ని కూడా షార్ట్ లిస్ట్ చేశాడు. కాల్షీట్లు, రెమ్యూనరేషన్ ఆధారంగా తన దగ్గరున్న లిస్ట్ లోంచి ఇద్దర్ని ఫైనల్ గా సెలక్ట్ చేయాలని అనుకుంటున్నాడు పూరిజగన్నాధ్.