పవన్ సినిమాల షెడ్యూలులో మార్పు?

పవన్ 2018 వరకే సినిమాలు చేస్తారు. ఎన్నికల సమయంలో గ్యాప్ తీసుకోక తప్పదు. ఈ విషయం పవన్ సోదరుడు నాగబాబు కూడా ఓ ఇంటర్వూలో చెప్పారు. ఎన్నికల సమయంలో మహా అయితే ఓ ఏడాది…

పవన్ 2018 వరకే సినిమాలు చేస్తారు. ఎన్నికల సమయంలో గ్యాప్ తీసుకోక తప్పదు. ఈ విషయం పవన్ సోదరుడు నాగబాబు కూడా ఓ ఇంటర్వూలో చెప్పారు. ఎన్నికల సమయంలో మహా అయితే ఓ ఏడాది గ్యాప్ వస్తుంది. కానీ పవన్ లాంటి హీరోకి ఆ మాత్రం గ్యాప్ వల్ల ఏమీ కాదు అని. సరే, ఆ సంగతి అలా వుంచితే ఇప్పటి దాకా పవన్ కమిట్ మెంట్ల ప్రకారం, త్రివిక్రమ్-హారిక హాసిని, ఎమ్ రత్నం-తమిళ దర్శకుడు, మైత్రీ మూవీస్-కొరటాల శివ సినిమాలు చేయాల్సి వుంది. ఇవి కాక ఇంకా ఒకటి రెండు చాలా అంటే చాలా పాత అడ్వాన్స్ లు కూడా పవన్ దగ్గర వున్నాయని వినికిడి.

2017లో మరో సినిమా, 2018లో రెండు సినిమాలు పవన్ చేయగలడు. ఆ లెక్కన హారికహాసిని, ఎఎమ్ రత్నం, మైత్రీ సినిమాలు పూర్తయిపోవడానికి అభ్యంతరం లేదు. అయితే ఎఎమ్ రత్నం సినిమా చేస్తారా? లేక త్రివిక్రమ్ సినిమా తరువాత నేరుగా మైత్రీ సినిమాకు వెళ్లిపోతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో త్రివిక్రమ్ సినిమా తరువాత ఈ కమిట్ మెంట్ ల్లో లేని బ్యానర్ కూడా సీన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నిర్మాత శరద్ మురార్ సినిమా అంటే వేరు, మిగిలిన వారి సినిమాలు వేరు. అయితే ఇప్పట్లో మరో సినిమా శరత్ కోసం చేసే అవకాశం లేదు. అందుకే తన చెప్పు చేతల్లో వుండే మరో బ్యానర్ కు ఓ సినిమా చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఈ విషయంలో పక్కా నిర్ణయం ఇంకా ఏదీ తీసుకోలేదు. కాటమరాయుడు విడుదల తరువాత కాస్త క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. అదే జరిగితే పవన్ తన సినిమాల షూటింగ్ మరి కాస్త స్పీడప్ చేయాలి. త్రివిక్రమ్ సినిమా ఆర్నెల్లలో పూర్తి చేయగలిగితే, 2017 ఆఖరి క్వార్టర్ నుంచి 2019 ఫస్ట్ క్వార్టర్ నాటికి మూడు సినిమాలు చేసేయవచ్చు. దాని వల్ల పవన్ కు పార్టీ నడపడానికి మరి కాస్త నిధులు సమకూరే అవకాశం కూడా  వుంటుంది.