ఛాంబర్ ఎన్నికలు.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. చాలామంది నిర్మాతలు, స్టుడియో ఓనర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న తమ్మారెడ్డి భరధ్వాజ… సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంబర్ ఎన్నికల…

తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. చాలామంది నిర్మాతలు, స్టుడియో ఓనర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న తమ్మారెడ్డి భరధ్వాజ… సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంబర్ ఎన్నికల ద్వారా డబ్బులు చేసుకోవడానికి, ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉందేమో అనే భయాన్ని వ్యక్తం చేశారు.

“చాలా ఎన్నికలు చూశాను. ఛాంబర్ లో నేను కూడా గెలిచాను, ప్రెసిడెంట్ గా చేశాను. కానీ ఈసారి వాతావరణం చూస్తుంటే.. ఛాంబర్ ఇంత ఎదిగిందని సంతోష పడాలా లేక ఎన్నికల్ని ఇలా పబ్లిక్ చేస్తున్నందుకు సిగ్గుపడాలో అర్థం కావడం లేదు. ఇది ఉన్నోడోకి లేనోడికి మధ్య పోటీనా అనేది అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఛాంబర్ లో సొమ్ము చేసుకోవడానికి ఏదో ఉందని నేను అనుకోవడం లేదు. దీని కోసం ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టుడియో యజమానులకు మంచి చేయడం కోసం ఛాంబర్ ఉంది. అంతేతప్ప, ఇక్కడ డబ్బులు చేసుకోవడానికి, ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉందా అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే భయమేస్తోంది.”

దిల్ రాజు ప్యానెల్, సి.కల్యాణ్ ప్యానెల్ కు మధ్య హోరాహోరీగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 1560 మంది సభ్యులున్న ఛాంబర్ లో ఈరోజు దాదాపు 900 మంది వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే అంచనాలున్నాయి.

ఇప్పటికే ఇటు దిల్ రాజు, అటు సి.కల్యాణ్ భారీగా ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే చిన్న నిర్మాతల్ని ఆదుకుంటానంటున్నారు సి.కల్యాణ్. అటు దిల్ రాజు, తను గెలిస్తే ఛాంబర్ లో సమూల మార్పులు తీసుకొస్తానంటున్నారు.

ప్రస్తుతానికైతే 250 మందికి పైగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. లెక్కప్రకారం, 6 గంటలకు విజేత ఎవరనేది ప్రకటించాలి. ప్రస్తుతం నడుస్తున్న హడావుడి చూస్తుంటే, ప్రకటన కాస్త ఆలస్యమయ్యేలా ఉంది.