రేపు కాటమరాయుడు రెండో సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డాలీ కాంబినేషన్ లోని కాటమరాయుడు సినిమా రెండో సాంగ్ కూడా బయటకు రాబోతోంది. ఇప్పటికే మిర మిర మీసం అంటూ హీరో ఎలివేషన్ సాంగ్ బయటకు విడుదల చేసారు. దానికి…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డాలీ కాంబినేషన్ లోని కాటమరాయుడు సినిమా రెండో సాంగ్ కూడా బయటకు రాబోతోంది. ఇప్పటికే మిర మిర మీసం అంటూ హీరో ఎలివేషన్ సాంగ్ బయటకు విడుదల చేసారు. దానికి మాంచి హిట్ లు వచ్చాయి యూ ట్యూబ్ లో. ఇప్పుడు రెండో సాంగ్ ను 9న విడుదల చేసే ఆలోచనలో వున్నారు. అయితే ఏ పాట విడుదల చేయాలన్నది ఇంకా డిసైడ్ కాలేదు. పాటలన్నీ రెడీనే. వాటిల్లో ఏది ముందు, ఏది వెనుక అన్నదే డిసైడ్ కావాలి. 

24 ఫిక్స్ అంట

కాటమరాయుడు విడుదల తేదీ మీదే కాస్త అనుమానం వుంది జనాల్లో. కారణం రెండు పాటలు ఫినిష్ చేసుకుని పవన్ ఇక్కడకు 14న వస్తారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్ మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయింది. లాక్ చేసి పక్కన పెట్టేసారు. సెకండాఫ్ పని మీద నిర్మాత శరద్ మురార్ బిజీగా వున్నారు. ఈ పని వుందనే ఆయన ముందుగా అనుకున్న ప్రకారం పవన్ తో కలిసి విదేశాలకు వెళ్లే ఆలోచన మానుకున్నారు.  రెండు పాటలు మినహా మిగిలిన పని అంతా 15కు ఫినిష్ చేయాలని, 18 న ఫంక్షన్ నాటికి మొత్తం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అలా అయితే 24న విడుదలకు ఏ అడ్డంకీ వుండదు.