రెండు పాత్రలు ఒకటిగా చేసిన డిజె

దర్శకుడు హరీష్ శంకర్ అదుర్స్ 2  అని ప్లాన్ చేసి ఎప్పుడో రాసుకున్న కథ దువ్వాడ జగన్నాధమ్ అలియాస్ డిజె. అయితే కారణాంతరాల వల్ల ఎన్టీఆర్ తో మెటీరియలైజ్ కాలేదు. ఆఖరికి దానికి అటు…

దర్శకుడు హరీష్ శంకర్ అదుర్స్ 2  అని ప్లాన్ చేసి ఎప్పుడో రాసుకున్న కథ దువ్వాడ జగన్నాధమ్ అలియాస్ డిజె. అయితే కారణాంతరాల వల్ల ఎన్టీఆర్ తో మెటీరియలైజ్ కాలేదు. ఆఖరికి దానికి అటు ఇటు మెరుగులు దిద్ది, గీతా ఆర్ట్స్ టైపు మార్పులు చేర్పులు చేసి, డిజెగా పట్టాలెక్కించారు. 

ఈ సినిమాకు అదుర్స్ కు వున్న తేడా ఒక్కటేనని తెలుస్తోంది. అదుర్స్ లో ఇద్దరు హీరోలు వుంటారు. ఒకరు బ్రాహ్మిన్. ఇంకొకడు రఫ్ అండ్ టఫ్. డిజె లో ఈ రెండు షేడ్స్ ఒక్కరిలోనే వుంటాయి. బయటకు అందరి ముందు బ్రాహ్మిన్ గా కనిపిస్తూ, తెర వెనుక రఫ్ అండ్ టఫ్ గా వుండాడట బన్నీ. ఈ ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో బయటకు వస్తుందట. 

భాషా, నాయక్, అదుర్స్ వంటి సినిమాల షేడ్స్ అన్నీ మిక్స్ చేసి ఈ కథ అల్లినట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అదుర్స్ లో ఆయుపట్టయిన కామెడీ డిజె లో కూడా బాగా పండినట్లు వినికిడి. హరీష్ శంకర్ డైలాగుల విషయంలో చాలా బన్నీ అభిమానులను దృష్టిలో వుంచుకుని మాంచి కేర్ తీసుకోవడంతో ఇది సాధ్యమైందని తెలుస్తోంది.