వయసు హుషారులో చేసే తప్పులు, ఆనక ఉచ్చులై చుట్టుకుంటాయి అంటారు. ఇప్పడు కోలీవుడ్ లో అదే జరుగుతోంది. సుచీ లీక్స్ పేరిట వస్తున్నవి, వస్తాయని వినిపిస్తున్నవి, ఆయా నటులకు బేజారు కలిగిస్తోంది. పరువు తీసి బజార్న పడేస్తోంది.
బయటకు వస్తాయో, రావో అన్న సంగతి అలా వుంచితే, ఈ సుచీ లీక్స్ పేరిట చలామణీ అవుతున్న గ్యాసిప్ లు మరింత గందరగోళానికి దారి తీస్తున్నాయి. లేటెస్ట్ గా సిద్దార్థ-సమంతల వ్యవహారం ఈ లీక్స్ లోకి వస్తుందని గ్యాసిప్ లు మొదలయ్యాయి. కొన్నాళ్ల పాటు వారిద్దరు క్లోజ్ గా వున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి, ఈ మేరకు ఊహాగానాలు పుట్టి వుండొచ్చు.
నిజానికి వారిద్దరి వీడియోలు, ఫోటోలు వుండే అవకాశమే ఎక్కువ. కానీ ఎవరి దగ్గర వుంటాయి. వారిద్దరి దగ్గరే. అలా కాకుండా సన్నిహితుల దగ్గర వుంటే మాత్రం కష్టమే. అసలే పెళ్లి దగ్గర పడుతున్న టైమ్ లో ఇలాంటివి బయటకు వస్తే బాగుండదు కూడా. ఈ సుచిలీక్స్ పుణ్యమా అని భవిష్యత్ లో కొన్నాళ్ల పాటు సినిమా జనం గ్రూప్ పార్టీలకు దూరంగా వుంటారేమో?