అవునా బాహుబలీ..కరెక్టేనా?

సినిమా జనాలకు సెంటిమెంట్లు ఎక్కువ. లెగ్ అనిపించిన వాళ్లని పక్కన పెడతారు. కొన్నిసార్లు ధైర్యం చేస్తారు. బాహుబలి ప్రభాస్ ఇలాంటి ధైర్యమే చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో అచ్చిరాని బాలీవుడ్ నటుడిగా పేరు…

సినిమా జనాలకు సెంటిమెంట్లు ఎక్కువ. లెగ్ అనిపించిన వాళ్లని పక్కన పెడతారు. కొన్నిసార్లు ధైర్యం చేస్తారు. బాహుబలి ప్రభాస్ ఇలాంటి ధైర్యమే చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో అచ్చిరాని బాలీవుడ్ నటుడిగా పేరు పడ్డాడు జాకీ షరాఫ్. అతగాడి అతిపెద్ద డిజాస్టర్ గా ఎన్టీఆర్ శక్తి రికార్డు వుండనే వుంది. 

ఇప్పుడు అలాంటి జాకీ షరాఫ్ ను మన బాహుబలి ప్రభాస్ తన తరువాతి సినిమాలోకి తీసుకుంటున్నాడట. రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ తో చేయబోయే భారీ సినిమాలో జాకీకి మాంచి పాత్ర వుందని తెలుస్తోంది. బాహుబలితో నేషనల్ రేంజ్ అందుకోవడంతో ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల చేసేందుకు, అక్కడి నటులు కొంతమందిని తీసుకుంటున్నారు. అలా ఎంపిక చేసిన వాళ్లలో జాకీ ఒకడట. 

దేశ వ్యాప్తంగా విడుదల చేయాలనుకోవడం, బాలీవుడ్ నటులను తీసుకోవడం వరకు ఒకె. కానీ ఆ తీసుకునేది కాస్త కలిసి వచ్చేవాళ్లను తీసుకుంటే బెటరేమో బాహుబలీ?