కాటమరాయుడు కథ కొత్తదేమీ కాదు. పైగా మన జనాలకు తెలిసిపోయిందే. ఎందుకంటే ఇంతకు ముందే ఇదే సినిమా వీరుడొక్కడే అంటూ డబ్బింగ్ చేసి వదిలారు. చూసిన వాళ్లు చూసారు. చూడని వాళ్లు నెట్ లో వెదుక్కున్నారు. అయినా పవన్ ధైర్యం ఏమిటి? తెలిసిపోయిన సినిమానే చేయడానికి. ధైర్యం మరేమీ కాదు. పవన్ దానికి చేర్చిన అదనపు హంగులు. కేవలం ఓ మిడిల్డ్ ఏజ్డ్ వ్యక్తి ప్రేమ కథ,అతని అన్నదమ్ముల మధ్య అనుబంధం మాత్రమే కాకుండా, జనం కోసం అన్న రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్ ను కూడా జోడించారట.
అందువల్ల హీరోగా పవన్ వుండే సీన్లు పెరగడంతో పాటు రెగ్యులర్ హెవీ కమర్షియల్ ఫ్లావర్ వస్తుంది. దర్శకుడు డాలీ, పవన్ కలిసి అదే చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేన అనే పొలిటికల్ పార్టీకి లీడర్ గా పవన్ ఇమేజ్ ను ఎలివేట్ చేసే విధమైన సీన్లు జోడించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన మిరా మిరా మీసం పాట జనసేన ఫ్లావర్ తో వున్న సంగతి అందరికీ అర్థమైంది. పైగా ఇప్పుడు హీరోయిన్ శృతిహాసన్ కూడా మాతృకతో సంబంధం లేకుండా కాటమరాయుడు చాలా మార్చారని అనడం విశేషం.
అయితే డాలీ ఓ మాస్ సినిమాను డీల్ చేయడం ఇదే ప్రథమం. ఇంతకు ముందు చేసిన రెండు డిఫరెంట్ సినిమాలు. ఈ సినిమా సక్సెస్ కొడితే డాలీ కూడా కమర్షియల్ డైరక్టర్ల జాబితాలోకి చేరతారు.