వెంకీ నెక్స్ట్ ఏంటీ?

కిషోర్ తిరుమల వచ్చాడు వెళ్లాడు..పూరిజగన్నాధ్ వచ్చాడు వెళ్లాడు. క్రిష్ వచ్చాడు వెళ్లాడు. తరువాత ఎవరు? సురేష్ మూవీస్ రాజ్యాంగంలో ఇమడాలి. వెంకీని మెప్పించాలి. అప్పుడు సినిమా స్టార్ట్ కావాలి. ప్రస్తుతం హీరో వెంకటేష్ గురు…

కిషోర్ తిరుమల వచ్చాడు వెళ్లాడు..పూరిజగన్నాధ్ వచ్చాడు వెళ్లాడు. క్రిష్ వచ్చాడు వెళ్లాడు. తరువాత ఎవరు? సురేష్ మూవీస్ రాజ్యాంగంలో ఇమడాలి. వెంకీని మెప్పించాలి. అప్పుడు సినిమా స్టార్ట్ కావాలి. ప్రస్తుతం హీరో వెంకటేష్ గురు ఫినిష్ చేసేసారు. తరువాతి సినిమా మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. సురేష్ దగ్గర పెళ్లి చూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ డేట్లు వున్నాయి కానీ, అతనితో ఏం సినిమా చేయాలనుకుంటున్నారన్న దానిపై క్లారిటీ లేదు. 

దర్శకుడు దశరథ్ ఓ మాంచి ఫ్యామిలీ స్టోరీ రెడీ చేస్తున్నారని, అది వెంకీ కోసమే అని గుసగుసలు వున్నాయి. ఏమైనా వెంకీకి సబ్జెక్ట్ సెట్ కావడం అంత సులువుకాదు. సీనియర్ హీరో కావడంతో కథ మిడిల్ ఏజ్డ్ చుట్టూ తిరగాలి. మళ్లీ అలా అని కథలో యంగ్ పెయిర్ వుండకూడదు. వెంకీ స్టయిల్ కామెడీ, యాక్షన్ కుదరాలి. ఇలా చాలా వున్నాయి. తీరా సబ్జెక్ట్ తెచ్చినా, మళ్లీ మారుతి బాబు బంగారం సీన్ రిపీట్ అవదని గ్యారంటీ లేదు.

మారుతి తెచ్చిన స్క్రిప్ట్ ను అటు చేసి ఇటు చేసి వెంకీకి అనుకూలంగా తన ఆస్థాన రైటర్లతో మార్చేసారని టాక్ వుంది. మరి ఇవి అన్నీ కుదిరి వెంకీ నెక్ట్స్ ఎప్పడు అన్నది తేలాలి.