మూడు పదులు దాటేసింది కదా త్రిష వయస్సు. అందుకే నోటి వెంట కర్మసిద్దాంత వచనాలు వస్తున్నాయి. త్రిష మన హీరో రానా కలిసి మరీ భావుకతతో ముద్దాడేసుకుంటున్న ఫోటో ఇటీవల ట్విట్టర్ లో లీకయింది. గాయని సుచిత్ర కార్తీక్ పుణ్యం అది.
దీనిపై ఎవరూ స్పందించలేదు. కానీ త్రిష మాత్రం కాస్త బాధగా ఘాటుగా స్పందించింది. 'పగ తీర్చుకోవాలని అనుకోనక్కరలేదు. మనను బాధ పెట్టిన వాళ్లు వారంతట వారే నాశనం అయిపోతారు. భగవంతుడి దయ వుంటే వారి నాశనం మనం కళ్లారా చూడొచ్చు' అంటూ కర్మసిద్దాంతాన్ని ఇలా వల్లె వేసింది.
ఈ ఫోటో బయటపెట్టడం అన్నది త్రిషను బాధపెట్టడం వాస్తవమే కదా? పాత జ్ఞాపకాలను, విఫల ప్రేమను గుర్తు చేస్తే ఎలాంటి వారికైనా బాధాకరమే కదా? త్రిష కర్మ సిద్దాంతం, గుర్తు చేసి బాధపెట్టిన సుచిత్రకే వర్తిస్తాయా? లేక విఫలానికి కారణమైన వారికి కూడా వర్తిస్తాయా?