అబూదాబీలో పాటేసుకున్న డిజె

దువ్వాడ జగన్నాధమ్ చకచకా రెడీ అయిపోతోంది. ఈ సినిమా కోసం ఇప్పుడు టీమ్ అబుదాబీ వెళ్లింది. అక్కడ జస్ట్ ఒకటి రెండు సీన్లు, ఓపాట తీయడం కోసం. సీన్లు నిన్న, మొన్న షూట్ చేసేసారు.…

దువ్వాడ జగన్నాధమ్ చకచకా రెడీ అయిపోతోంది. ఈ సినిమా కోసం ఇప్పుడు టీమ్ అబుదాబీ వెళ్లింది. అక్కడ జస్ట్ ఒకటి రెండు సీన్లు, ఓపాట తీయడం కోసం. సీన్లు నిన్న, మొన్న షూట్ చేసేసారు. దాంతో నిర్మాత దిల్ రాజు వెనక్కు వచ్చేసారు. పాట షూట్ ఈ రోజు ప్రారంభమైంది. అది పూర్తయితే యూనిట్ వెనక్కు వచ్చేస్తుంది.

పూజ హెగ్డే, అల్లుఅర్జున్ లపై క్లాస్ ప్లస్ మాస్ బీట్ కలబోసిన ఓ పాటను పిక్చరైజ్ చేస్తున్నారట. ఇది కాగానే వెనక్కు వచ్చి మిగిలిన టాకీ, సాంగ్స్ కంప్లీట్ చేసేస్తారు. డిజె షూట్ పార్ట్ కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, తాను వక్కంతం వంశీ సినిమా మీదకు వెళ్తాడు బన్నీ. ఆ సినిమాకు సంబంధించి షెడ్యూళ్లు, కాల్ షీట్ లు వంటి వ్యవహారాలు చకచకా ఫైనల్ చేస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు ఒకరిద్దరు, హీరోయిన్ లాంటి కీలక అగ్రిమెంట్లు మినహా మిగిలినవి అన్నీ రెడీ అయిపోయినట్లే.