వక్కంతంకి మరో హ్యాండ్ తప్పదా…

డైరక్టర్ గా మెగాఫోన్ పట్టుకుందామని ఎన్నో ఏళ్లుగా కలలుకంటున్న వక్కంతం వంశీకి ఇప్పటికే ఓ ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఫైనలైజ్ అయిందనుకున్న ఎన్టీఆర్ ప్రాజెక్టు చేజారిపోయింది. దీంతో ఏకంగా తారక్ కోటరీ నుంచే బయటకు…

డైరక్టర్ గా మెగాఫోన్ పట్టుకుందామని ఎన్నో ఏళ్లుగా కలలుకంటున్న వక్కంతం వంశీకి ఇప్పటికే ఓ ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఫైనలైజ్ అయిందనుకున్న ఎన్టీఆర్ ప్రాజెక్టు చేజారిపోయింది. దీంతో ఏకంగా తారక్ కోటరీ నుంచే బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా మెగా కాంపౌండ్ లోకి ఎంటరైన వక్కంతం, మరో పవర్ ఫుల్ స్టోరీతో బన్నీని ఇంప్రెస్ చేశాడు. అల్లుఅర్జున్ కు కూడా కథ నచ్చిందని టాక్. మరో నెలరోజుల్లో సినిమా ప్రారంభం అవుతుందని అంతా చెప్పుకుంటున్నారు. అయితే ఇంతలోనే వక్కంతంకు మరో ఎదురుదెబ్బ పొంచి ఉంది. 

ఈసారి వీవీ వినాయక్ రూపంలో వక్కంతం వంశీకి షాక్ తగిలే ప్రమాదం ఉందంటున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న వినాయక్, ఇప్పుడు బన్నీ కోసం ఓ స్టోరీ తయారుచేస్తున్నాడట. ఇన్నాళ్లూ సాయిధరమ్ తేజతో సినిమా చేస్తాడని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఈ దర్శకుడి కన్ను బన్నీపై పడిందట. పైగా వినాయక్ చెబితే బన్నీ కాదనడు. 

గతంలో వినాయక్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో బన్నీ, బద్రినాథ్ సినిమాలొచ్చాయి. బద్రీనాథ్ డిజాస్టర్ అయిన తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు బన్నీ కోసం ఓ వినోదాత్మక యాక్షన్ చిత్రాన్ని వండుతున్నాడట వినాయక్. అదే కనుక జరిగితే వక్కంతం వంశీకి మరోసారి హ్యాండ్ తప్పకపోవచ్చు.