గతంలో వీళ్లిద్దరూ కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించారు. అప్పుడే పవన్ కు బాగా దగ్గరైంది శృతిహాసన్. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి కాటమరాయుడు సినిమా చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాతో పోలిస్తే, కాటమరాయుడు సెట్స్ లో పవన్-శృతిహాసన్ మరింత క్లోజ్ గా ఉన్నారు. చాలా విషయాలపై చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓ విషయంపై శృతిహాసన్ కు ఓ రేంజ్ లో క్లాస్ పీకాడట పవన్ కల్యాణ్. ఒక్కముక్కలో చెప్పాలంటే ఫుల్ గా జ్ఞానోదయం కల్పించాడట.
మాటల సందర్భంలో సౌత్ సినిమాకు దూరం అవుతానని శృతిహాసన్, పవన్ తో చెప్పిందట. కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలపై ఫోకస్ తగ్గించి, పూర్తిగా బాలీవుడ్ సినిమాలపై దృష్టిపెట్టాలని అనుకుంటున్నట్టు తన మనసులో మాటను బయటపెట్టిందట. ఇతరుల వ్యక్తిగత విషయాలు, కెరీర్ పట్ల తన సొంత అభిప్రాయాల్ని పెద్దగా వెల్లడించని పవన్, ఈ విషయంలో మాత్రం శృతికి బాగా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ కంటే సౌత్ సినిమా ఎంత గొప్పదో, ఎందుకు వదులుకోవద్దో శృతిహాసన్ కు వివరించాడట పవన్. మరీ ముఖ్యంగా లాంగ్ పీరియడ్ కెరీర్ కొనసాగించాలనుకునే హీరోయిన్లు సౌత్ లో బేస్ ఏర్పాటుచేసుకుంటే మంచిదని శృతిహాసన్ కు సలహా ఇచ్చాడట. పైగా బాలీవుడ్ లో ఉండే కొన్ని లోటుపాట్లను కూడా ఆమెకు వివరించాడట. పవన్ చెప్పిన సలహాలతో తన నిర్ణయంపై పునరాలోచనలో పడింది శృతిహాసన్.