ఇది ఫిక్స్. ఇక హీరో నాని సినిమా ఏదయినా 20 కోట్లు కలెక్ట్ చేయాల్సిందే. అప్పుడే బయ్యర్లు బయటపడతారు. ఎందుకంటే ఇకపై నాని సిన్మాల ప్రొడక్షన్ కాస్ట్ కనీసం 15 కోట్లు దాటేయబోతోంది. వరుస హిట్ లతో వున్న నాని పారితోషికం ఇప్పుడు అయిదు కోట్ల రేంజ్ కు చేరుకుంది. దీంతో కాస్టింగ్, ప్రొడక్షన్, పబ్లిసిటీ అన్నీ ఎంత హీనంగా చూసుకున్నా 15 కోట్లు పక్కగా కావాల్సిందే. మరి ఆ రేంజ్ లో అమ్మకాలు, దానిపై కనీసం 20శాతం కమిషన్ చూసుకున్నా 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు రావాల్సి వుంటుంది. అలా అని నిర్మాతలకు వచ్చిన సమస్యేమీ లేదు. ఎందుకంటే సినిమా బాగుండే నాలుగు కోట్ల వరకు శాటిటైల్ వుంటుంది. నాని సినిమాలకు అమ్మకాలు కూడా ఫరవాలేదు కాబట్టి.
నాని ఈ మధ్య ప్రకటించిన తాజా సినిమాకు నాలుకున్నర కోట్లతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి. రాబోయే సినిమా ఒక్కటి హిట్ కొట్టినా చాలు. ఈ నాలుగున్నర కోట్లు కాస్తా అయిదు దాటేయడం గ్యారంటీ. తనకు మాత్రమే నప్పే బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ ఇలాంటి ప్లస్ పాయింట్ లతో నాని కాస్త వీక్ గా వున్న సబ్జెక్ట్ ను కూడా సక్సెస్ దిశగా తీసుకుపోగలుగుతున్నాడు. అందువల్లే నిర్మాతలకు ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా మారాడు. దీంతో రెమ్యూనిరేషన్ గ్రాఫ్ అలా అలా పైపైకి వెళ్తోంది.