వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. అవును.. కుదిరితే బాహుబలి-2లో చిరంజీవిని కూడా భాగస్వామిగా చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నాడట. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న బాహుబలి – ది కంక్లూజన్ సినిమాలో చిరంజీవిని ఎలా ఇరికిస్తారనే డౌట్ అందర్లో ఉంది. దీనికి జక్కన్న దగ్గర సమాధానం ఉంది.
బాహుబలి పార్ట్-2లో కొన్ని సన్నివేశాలకు చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించాలని యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే ఘాజి, గుంటూరోడు లాంటి సినిమాలకు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. అదే కోవలో బాహుబలి-2లో కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ లో మెగాస్టార్ వాయిస్ వినిపించాలని జక్కన్న భావిస్తున్నాడట.
బాహుబలి-2 లాంటి గ్రాండ్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ లో చిరంజీవి లాంటి స్టార్ వాయిస్ పడితే, సినిమాకు మరింత వెయిట్ పెరుగుతుంది. సేమ్ టైం, ఇవే సన్నివేశాలకు తమిళ, హిందీ భాషల్లో కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన స్టార్స్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలనేది రాజమౌళి ప్లాన్.