బాలయ్య-పూరి..నో గ్యారంటీ?

పూరి జగన్నాథ్-బాలయ్య సినిమా విడుదల కాకుండానే ప్రకంపనాలు సృష్టింస్తోంది. అసలు ఈ కాంబినేషన్ నే అబ్బురం అనుకున్నారంతా. ఇంతలో బాలయ్య తప్ప అంతా కొత్త నటులు వుండే రేంజ్ లో దర్శకుడు పూరి కాస్టింగ్…

పూరి జగన్నాథ్-బాలయ్య సినిమా విడుదల కాకుండానే ప్రకంపనాలు సృష్టింస్తోంది. అసలు ఈ కాంబినేషన్ నే అబ్బురం అనుకున్నారంతా. ఇంతలో బాలయ్య తప్ప అంతా కొత్త నటులు వుండే రేంజ్ లో దర్శకుడు పూరి కాస్టింగ్ కాల్ ఇచ్చేసారు. అది కూడా నిర్మాతకు  హీరో బాలకృష్ణకు తెలియకుండానే. అదేమని అడిగితే, అది మామూలే అని పూరి తేల్చేసారు.

బాలయ్య సినిమా అంటే ఓ రేంజ్ వుంటుంది. ఓ లెవెల్ స్టార్ కాస్ట్  వుండాలి. పైగా పెద్ద సినిమా అన్నపుడు కాస్త గట్టు మట్టు వుంటుంది. పూరి దగ్గర ఇవేవీ కనిపించడం లేదు. దీంతో బాలయ్య పునరాలోచనలో పడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. బాలకృష్ణ వ్యవహారం చిత్రంగా వుంటుంది. ఆయన సీరియస్ అయితే ఫట్ నో చెప్పేసే ప్రమాదం వుంది.

దీనికి తోడు పూరి ఇప్పటికీ తన రెమ్యూనిరేషన్ చాలా భారీగా అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా బాలయ్య రెమ్యూనిరేషన్ కు దాదాపుగా డబుల్. దీంతో నిర్మాణ వ్యయం ముఫై అయిదు కోట్లు అయిపోయే ప్రమాదం వుంది. ఇవన్నీ కలిసి సినిమాను ఆలోచనలోకి పడేసాయి. బాలయ్యతో డిస్కషన్ తరువాతే ఏ నిర్ణయం తీసుకునే అవకాశం వుందని వినికిడి. మహేష్ బాబు, చిరంజీవి, వెంకీ బాటనే బాలయ్య కూడా పట్టేస్తారా?  లేక పూరి తో సినిమా చేస్తారా? అన్నది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.